'క్రాక్' టీంతో ఏఆర్ మురగదాస్..!

By అంజి  Published on  6 Jan 2020 9:48 AM GMT
క్రాక్ టీంతో ఏఆర్ మురగదాస్..!

డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని - మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబినేష‌న్ లో రాబోతున్న 'క్రాక్' సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే క్రాక్ సెట్ కి ఈ రోజు క్రియేటివ్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ వెళ్లారు. దర్బార్ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా హైదరాబాద్‌ కు వచ్చిన ఆయన.. రవితేజ 'క్రాక్‌' సెట్‌ కి వెళ్లి ఆ సినిమాకి సంబంధించిన విషయాలను తెలుసుకుని క్రాక్ డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేనికి అలాగే మిగిలిన చిత్రయూనిట్ కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. కాగా మురుగదాస్‌ తమ సినిమా సెట్‌ కి వచ్చినప్పుడు దిగిన ఫోటోను దర్శకుడు గోపిచంద్‌ మలినేని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

కాగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమాని 2020 సమ్మర్ లో విడుదల్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందట. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ప్రస్తుతం మాస్ మహారాజా వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మాణంలో 'డిస్కోరాజా' అనే సినిమాతో ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రానున్నాడు. ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ , తాన్యాహోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి రవితేజకి ఈ సినిమా ఎంతవరకు హిట్ ఇస్తోందో చూడాలి.

Next Story
Share it