తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దీప్‌వీర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Nov 2019 6:46 AM GMT
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దీప్‌వీర్

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. బాలీవుడ్‌ జంట దీపికా పదుకొణె, రణవీర్‌ సింగ్‌లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అయితే వీరిద్దరి పెళ్లి జరిగి..సంవత్సరం గడిచిన సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ జంటకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం వీరికి ఆలయ అధికారులు స్వామివారి తీర్ధ ప్రసాదాలను, చిత్ర పటాన్ని అందజేశారు.

అయితే దీప్‌వీర్‌లు రేపు అమృత్‌సర్‌కు చేరుకొని స్వర్ణదేవాలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కొన్ని సంవత్సరాలు ప్రేమలో ఉన్న ఈ జంట గత సంవత్సరం నవంబర్‌ 14న ఇటలీలోని లేక్‌ కోమోలో వివాహ బంధంతో ఒక్కటయిన సంగతి మనకు తెలిసిందే.

Next Story