దేవ‌దాసు, పోకిరి, కిక్… ఇలా సూపర్‌ హిట్‌ మూవీస్‌లో న‌టించి అన‌తి కాలంలోనే టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అనిపించుకుంది ఇలియానా. ఆత‌ర్వాత స‌రైన స్ర్కిప్ట్స్ ఎంచుకోక‌పోవ‌డం.. టాలీవుడ్ క‌న్నా బాలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెట్ట‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల ఇలియానాకి టాలీవుడ్‌లో అవ‌కాశాలు క‌నుమ‌రుగ‌య్యాయి. ఇటీవ‌ల చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో ర‌వితేజ స‌ర‌స‌న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాలో న‌టించింది కానీ.. ఈ సినిమా స‌క్సెస్ కాలేదు.

ఇదిలా ఉంటే.. ఇలియానా మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ సినిమాలో న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త వాస్త‌వం కాద‌ని చిత్ర యూనిట్ తేల్చి చెప్పేసింది. ఇలియానా గురించి వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ కోసం ఇలియానాని సంప్ర‌దిస్తే… నో చెప్పింద‌ట‌.

బ‌న్నీ తాజా చిత్రం అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో కూడా స్పెష‌ల్ సాంగ్ కోసం ఇలియానాని సంప్ర‌దిస్తే.. నో చెప్పింద‌ట‌. కార‌ణం ఏంటంటే… ఇలియానా క‌థానాయిక పాత్ర‌లే చేయాలి అనుకుంటుంద‌ట‌. స్పెష‌ల్ సాంగ్స్, గెస్ట్ రోల్స్.. ఇలా చిన్న చిన్న పాత్ర‌లు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌. మ‌రి.. ఆమె కోరుకున్న‌ట్టుగా క‌థానాయిక పాత్ర‌లు వ‌స్తాయో.. రావో తెలియాలంటే కొంత కాలంగా ఆగాల్సిందే.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.