ధోనీ గ్రౌండ్‌లో లేడు. కాని మ్యాచ్ చూస్తూ ఆయన వాయస్ వినొచ్చు. ఎలా అంటారా..? డే అండ్ నైట్ మ్యాచ్‌లకు ధోనీ వ్యాఖ్యాతగా వస్తున్నాడు. ఇది..ధోనీ అభిమానులకు శుభవార్తే. 2014 ఆస్ట్రేలియా సిరీస్ తరువాత ధోనీ టెస్ట్‌లకు గుడ్ బై చెప్పాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ నెల 22న భారత్ చారిత్రాత్మక డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. ఈ నేపథ్యంలో స్టార్ ఇండియా పెద్ద ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. భారత్‌కు టెస్ట్ ల్లో ప్రాతినిధ్యం వహించినవారిని తొలి రెండ్రోజులు ఆహ్వానిస్తారు. రోజంతా కెప్టెన్లు కామెంటరీ బాక్స్‌లో ఉంటారు. అంతేకాదు..భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్ర, ముఖ్యమైన ఘటనలు గురించి చెబుతారు. అయితే..ఈ ప్రణాళికకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఓకే చెప్పాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.