బుల్లితెర పై “ఢీ”  డాన్స్ రియాలిటీ షోగా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్ప‌టికే ప‌ద‌కొండు సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని, “ఢీ”ఛాంపియన్స్‌గా ప‌న్నెండ‌వ సీజ‌న్‌లోకి అడుగుపెట్టి విజ‌య‌వంతంగా దూసుకుపోతుంది. ఈ ఢీ చాంపియ‌న్స్ షోకి యాంక‌ర్‌గా ప్ర‌దీప్ అల‌రిస్తుండ‌గా., టీమ్ లీడ‌ర్స్‌గా సుధీర్-ర‌ష్మీ అండ్ ఆది-వ‌ర్షిణిలు న‌వ్వులు పూయిస్తున్నారు. ఇక జ‌డ్జీలుగా శేఖ‌ర్ మాస్ట‌ర్, ప్రియ‌మ‌ణి, పూర్ణ‌.. ఈ ముగ్గురు ప‌ర్మినెంట్ కాగా, అప్పుడ‌ప్పుడు కొంద‌రు సెల‌బ్రిటీలు జ‌డ్జీలుగా మెరుస్తున్నారు. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. తాజాగా విడుద‌ల అయిన ఢీ ప్రోమో ఓ రేంజ్‌లో ఉందంటున్నారు. ఈ ప్రోమో విష‌యానికి వ‌స్తే.. హాట్‌గా మొద‌లై, శాడ్‌గా ఎండ్ అయ్యింది. ఆది అండ్ వ‌ర్షిణి టీమ్ నుండి వ‌చ్చిన మాన‌సి, దృవ చిత్రం నుండి ప‌రేషానురా సాంగ్‌తో హాట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రోమోలో చూపించిన చిన్న బిట్‌సాంగ్‌లోనే అదిరిపోయే హాట్ ప‌ర్ఫామెన్స్ ఇచ్చిన‌ మాన‌సి.. ఫుల్‌సాంగ్‌లో ఎలా రెచ్చిపోయిందో అని అంద‌రూ ఆత్రుత‌గా ఎద‌రు చూస్తున్నారు.

గ‌త వారం ఎపిసోడ్‌లో బుట్ట‌బొమ్మ‌గా ఎంట్రీ ఇచ్చిన మాన‌సి, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప్ర‌శంస‌లు అందుకుంది. మాన‌సి క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌కి సెల్యూట్ చేశారు శేఖ‌ర్ మాస్ట‌ర్. ఎలాంటి సాంగ్ ఇచ్చినా, ఆ సాంగ్‌కు త‌గ్గ‌ట్టు ఒదిగిపోయే స్పెష‌ల్ క్వాలిటీ ఉంద‌ని, మాన‌సి త‌న ఫ్యావ‌రేట్ కంటెస్టెంట్ అని చెప్పారు. అయితే తాజా ప్రోమోలో మాన‌సిని చూస్తే శేఖ‌ర్ మాస్ట‌ర్ మాట‌లు నిజం చేస్తూ ఈసారి హాట్ సాంగ్‌తో ఎలా ర‌చ్చ చేస్తుందో చూడాలి. ఇక‌పోతే ఈ ప్రోమోలో మ‌రో కంటెస్టెంట్‌ రిత్విక్ ప‌ర్ఫామెన్స్ దెబ్బ‌కి అంద‌రి గుండెలు భార‌మెక్కిపోతాయి. ర‌ఘ‌వ‌ర‌న్ బీటెక్ నుండి అమ్మా అమ్మా కాన్సెప్ట్ బేస్‌డ్ హైలీ ఎమోష‌న‌ల్ సాంగ్‌కి క‌ళ్ళ‌కు గంత‌లు క‌ట్టుకుని రిత్విక్ చేసిన పెర్ఫామెన్స్‌కి కొంత‌మంది అక్క‌డే ఏడ్చేశారు. ఇలాంటి డాన్స్ నా లైఫ్‌లో ఫ‌స్ట్‌టైమ్ చూస్తున్నాని శేఖ‌ర్ మాస్ట‌ర్ చెప్ప‌డంతోనే అర్ధ‌మ‌వుతోంది రిత్విక్ ఏ రేంజ్‌లో జీవించాడో అర్ధ‌మ‌వుతోంది.

ఇంతలా ఏముంద‌ని మీకు అనిపించ‌వ‌చ్చ‌.. అయితే ఢీ షోలో ఎప్పుడూ న‌వ్వుతూ క‌నిపించే కంటెస్టెంట్ త‌న్వీ.. అయితే రిత్విక్ ప‌ర్ఫామెన్స్ చేస్తున్న టైమ్‌లో త‌న్వీ వెక్కి వెక్కి మ‌రీ ఏడుస్తూ.. చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం చూస్తే.. క‌న్నీళ్ళు ఆగ‌వు. దీంతో రిత్విక్ ఫ‌ర్ఫామెన్స్ ఢీ హిస్ట‌రీలోనే వ‌న్ ఆఫ్ ద బెస్ట్ అయ్యే ఆవ‌కాశం ఉంది. ఇందండీ ఢీ చాంపియ‌న్స్ లేటెస్ట్ ప్రోమో విశేషాలు.. ముందుగానే మ‌నం చెప్పుకున్న‌ట్లు హాట్‌గా స్టార్ట్ అయ్యి శాడ్‌గా ఎండైంది. ఇక ఈ వారం ఎలిమినేష‌న్ కుడా ఉందండోయ్.. మ‌రి వ‌చ్చే వారం ఢీ చాంపియ‌న్స్ త‌ప్ప‌కుండా చూడండి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.