పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ సవాంగ్ భేటీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Oct 2019 11:04 PM ISTఅమరావతి : ఏపీ డీజీపీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో గౌతం సవాంగ్ భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, ఐటి , కోర్ టీం సిబ్బంది హాజరయ్యారు. వారాంతపు సెలవులు (వీక్లీ ఆఫ్) మరింత పారదర్శకత ఉండేలా ఆన్ లైన్ సాఫ్ట్ వేర్ సిస్టం ప్రవేశపెట్టామని సవాంగ్ చెప్పారు. పోలీస్ సిబ్బందికి వచ్చే నెలలో రావాల్సిన వారాంతపు సెలవులు ఈనెల 25వ తారీకు నుంచే తీసుకుంటారన్నారు. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా రాష్ట్రంలో ఉన్న సిబ్బంది అందరూ ఎప్పుడు ..ఎవరెవరు సెలవులో ఉంటారనే విషయాలు డిజిపి డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షించవచ్చని చెప్పారు. అంతేకాదు..జిల్లాలో సిబ్బంది ఎవరెవరు వీక్లీ ఆఫ్ తీసుకున్నారో అధికారులకు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశానికి హాజరైన అధికారులు, సిబ్బంది వారాంతపు సెలవులు అమలుచేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.