గోదా గోవింద గీతం : తెలతెలవారు ఝామునే నీ కోవెలకు జేరినాము

You are our heavenly path.శిత్తమ్ శిఱుకాలే వంద్ ఉన్నై శేవిత్తు ఉన్

By M Sridhar  Published on  13 Jan 2023 2:03 AM GMT
గోదా గోవింద గీతం : తెలతెలవారు ఝామునే నీ కోవెలకు జేరినాము

తెలతెలవారు ఝామునే నీ కోవెలకు జేరినాము

శిత్తమ్ శిఱుకాలే వంద్ ఉన్నై శేవిత్తు ఉన్

పొత్తామరై యడియే పోట్రుం పొరుళ్ కేళాయ్

పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు, నీ

కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు

ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!

ఎత్తెక్కుం ఏరేర్ పిఱవిక్కుం ఉన్ తన్నో

డుత్తోమేయావోం ఉనక్కే నాం ఆట్చెయ్ వోం

మత్తై నం కామంగళ్ మాత్త్-ఏలోర్ ఎంబావాయ్


భావార్థ గీతిక

తామరవోలె మృదువుగా గుబాళించు నీ పసిడి పాదాల

వ్రాల తెలతెలవారు ఝామునే నీ కోవెలకు జేరినాము

పశువుల మేపు వారలకు పఱైలు పఱములేలనయ్య

మా గొల్లలకు నీ తోడినేస్తమే సమస్త సిరిసంపదలయ్య

మా కులాన జనించిన నీవు మాసేవలు కాదనరాదు

ఏడేడు జన్మల నిన్నెడబాయని సాపత్యమీయవయ్య

ఇతర వాంఛలెల్ల తుడిచివేసి నిన్నుమాత్రమే ధ్యావించి

నిన్నె సేవించి పూజించు బుద్ధి వరముగా నీయవయ్య

సాయుజ్యం కావాలని మనసారా కోరాలి. సంసారం నుంచి దూరమై, భగవంతుడినిచేరి భగవదనుభవం పొందు గాక

అర్థం: తెల్లవారుఝాముకన్నా ముందటి బ్రాహ్మీ ముహూర్తంలో (శిట్రం శిరుకాలే) వచ్చి (వందు) నిన్ను సేవించి (ఉన్నైశేవిత్తు) నీ అందమైన పాదకమలాలకు (ఉన్ పొన్ తామరై అడి)మంగళాశాసనం చేయడానికి గల ప్రయోజనాన్ని (పొట్రుమ్ పొరుళ్) వినాలి (కేళాయ్) పశువులను మేపి (పెట్రమ్ మేయ్ త్తు) జీవించే (ఉణ్ణుమ్) యాదవకులంలో (కులత్తిల్) జనించి (పిఱందు) నీవు (నీ) మాచే (ఎంగళై) ఆంతరంగిక కైంకర్యాన్ని (కుట్రేవల్) స్వీకరించకుండా ఉండడం తగదు (కొళ్లామల్ పోగాదు) ఈ రోజు (ఇట్రై) నీవు కరుణించి ప్రసాదిస్తున్న పఱైని తీసుకొనడానికి వచ్చిన వారిమి కాము (పఱై కొళ్వాన్ అన్ఱు కాణ్). ఓ గోవిందా (గోవిందా) ఈ కాలమున్నంతవరకు (ఎట్రైక్కుమ్) ఏడేడు జన్మలకు (ఏజేజ్ పిఱవిక్కుమ్) నీతోనే (ఉన్ తన్నోడు) సంబంధం కలిగిన వారై ఉంటాము (ఉట్రేమే ఆవోమ్) నీకు మాత్రమే (ఉనక్కే) మేము (నామ్) దాస్యం చేయాలని కోరుకుంటున్నాము (ఆట్చెయ్ వోమ్) మాయొక్క (నమ్) తదితర కోరికలు (మాట్రైకామంగళ్) పోగొట్టాలి (మాట్రు)ప్రాతః వేళలు మూడు – కాలై, చిరుకాలై, శిట్రం శిరుకాలై తామసులు లేచే వేళ కాలై, గోపస్త్రీలు చేలుకుని చల్ల చిలికే వేళ చిరుకాలై, దానికన్న ముందుగా గోపబాలికలు లేచిన వేళ శిట్రం శిరుకాలే. శ్రీకృష్ణుడివియోగ దుఃఖం అనే చీకటి పోగొట్టడానికి ఉదయించే సూర్యబింబం పోలిన ముఖాన్ని శ్రీకృష్ణుడిని చూడడానికి పోతున్నందున ఇదే ఉదయమైపోయింది. ''ఆవిర్భూతమ్ మహాత్మానా'' అంటే భగవంతుడు ఆవిర్భవించిన అర్ధరాత్రి కూడా ఉదయకాలమే అవుతుంది.

- మాడభూషి శ్రీధర్

Next Story