గోదా గోవింద గీతం: కొరత లెరుగని వంశమున బుట్టిన యాదవ శూరులు
Yadava warriors born in a lineage that is not lacking. ఎప్పుడు దూడలై యుండు ఆల పాలు పితుకు వారు
By M Sridhar Published on 26 Dec 2022 7:11 AM ISTకత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్
భావార్థ గీతిక
ఎప్పుడు దూడలై యుండు ఆల పాలు పితుకు వారు
వైరి కోటల ముట్టడించి గెలిచెడి వీర గోపాలురు వారు
కొరత లెరుగని వంశమున బుట్టిన యాదవ శూరులు
పాముపడగ నితంబుముల దాన, నెమలి రంగుదాన
బంగారు తీగ మెరుపు మేనుదాన బంధుసఖుల మెల్ల
నీదు భవనపు వాకిటచేరి నిలిచినాము మొగలి వన్నెవాడు
మోహన మురళీ కృష్ణు ముద్దుల జవరాల నిదుర ఇంకేలనమ్మ
కరుణించి కదలి రావమ్మ సిరినోముజేయ మాదరి జేరవమ్మ
దర్శనముతో గోపికలనూ స్పర్శనముతో గోవులనూ అలరించే మేఘవర్ణుడు
అర్థం
కత్తుకఱవై= దూడల వంటి పశువులు, పలకణంగళ్ = అనేక మందలను, కఱందు=పాలుపితుకుతున్న వారు, సెట్రార్= శత్రువుల, తిఱల్ అఝియ= బలం నశించే విధంగా, చెన్ఱు= దండెత్తి, శెరుశెయ్యుమ్=యుద్ధం చేసే వారును, కుట్రమ్ ఒన్రు ఇల్లాద= కొరత ఏదీ లేని వారయిన, కోవలర్ తమ్= గోపవంశంలో జన్మించిన పొర్ కొడియే = బంగారు తీగ వలెనున్నదానా, పుట్రు అరవు అల్ గుల్ = పుట్టలోని పాముపడగవంటి నితంబము గలదానా, పునమయిలే= తోటలోని నెమలి వలె ఉన్నదానా, పోదరాయ్=బయలుదేరి రావమ్మా, శుట్రత్తు=చుట్టములు, తోఝిమార్= చెలికత్తెలు, ఎల్లారుమ్= ఎల్లరును, వందు= వచ్చి, నిన్ ముట్రమ్ పుగుందు= నీ భవనమునందు ప్రవేశించి, ముగిల్ వణ్ణన్= మొగిలి వర్ణముకలగిన (మేఘపు మేని రంగువాడు) శ్రీకృష్ణుడు, పేర్ = పేరు, పాడ= పాడుటకు, శెల్వ= అందమైన, పెండాట్టి నీ=సతీమణీ, శిట్రాదే పేశాదే= ఉలకకుండా పలకకుండా, ఎత్తుక్కు= ఎందుకు, ఏ ప్రయోజనాన్న ఆశించి, ఉరంగుమ్= నిద్రిస్తున్నావు, పోరుళ్= దీనికి కారణమేమిటి?