గోదా గోవింద గీతం : నీ వైభవమ్ము కీర్తించి పఱైనడగ వచ్చినాము
We have come to glorify your glory.కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై
By M Sridhar
కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై
ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్
నాడు పుగళుం పరిశినాళ్ నన్ఱాక
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్
ఆడైయుడుప్పోం అదన్ పిన్నే పాల్ శోఱు
మూడనెయ్ పెయ్దు ముళగైవళివార
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్
భావార్థ గీతిక
ఒల్లని మనసులైన గెల్చెడి గోవింద బిరుదాంకితా
నీ వైభవమ్ము కీర్తించి పఱైనడగ వచ్చినాము, లేక
జగమెల్ల మెచ్చురీతి పెద్దసన్మానమును కోరినాము
బంగారు మణి కంకణములు, కై దండలు కొన్ని
గున్నాలు చెవిపూలు, కాలికై వెండికడియాలు
మేలి వస్త్రములు ఆపైన, మోజేతిదాక నేయి కారెడు
పాలపాయసాన్నములు నీ చెంత కూర్చుని ఆరగించ
మాకు నీ నిత్య సాంగత్య దివ్యసౌభాగ్య సాకేతమిమ్ము
భగవంతుని అందడం, ఆయన కళ్యాణ గుణాలను అనుభవించడమే వ్రత ఫలం
అర్థం : కూడారై = తనను కూడని వారిని సైతం, వెల్లుమ్= జయించే: శీర్= కళ్యాణగుణసమన్వితుడైన: గోవిందా = గోవింద నామధేయుడా, ఉన్ఱనై= నిన్ను, ప్పాడి = కీర్తించి, పఱైకొండు =పర అనే వాయిద్యాన్ని కోరి, యామ్= మేము,పెరు= పెద్ద లేదా పొందెడి, శమ్మానమ్=సన్మానమును,నాడు=లోకమంతయు, పుగళం పరిశినాళ్ = మెచ్చుకునే రీతిలో, నన్ఱాకబ శూడగమే= చేతికి ఆభరణాలు, తోళ్ వళైయే= భుజకీర్తులు, తోడే= కర్ణాభరణాలైన దుద్దులు, శెవి ప్పూవే= చెవికి ధరించే పూవులు, పాడకమే = పాదాభారణాలు, యెన్ఱనైయ = అని పిలువ బడే, పల్కలనుమ్=అనేక రకాల ఆభరణాలను, యామ్ = మేము, అణివోమ్= ధరింతుముగాక,ఆడై= వస్త్రములను, ఉడుప్పోం = ధరింతుముగాక, అదన్ పిన్నే= దాని తరువాత, పాల్ శోఱు= పాలతోచేసిన అన్నము, పరమాన్నము, మూడ =నెయ్ పెయ్దు = నేయి పోసి, ముళంగై = మోచేతినుండి, వళివార=కారునట్లుగా, కూడి ఇరుందు= నీతో కలిసియుండి, కుళిరుంద= ఆరగించడమే-ఏలోర్ ఎంబావాయ్= మావ్రతము.
- మాడభూషి శ్రీధర్