విష్ణు సహస్ర నామాలు జన్మించిన రోజే భీష్మ ఏకాదశి
Today is Bhishma Ekadashi.మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. 1 ఫిబ్రవరి 2023 నాడు భీష్మ ఏకాదశి
By M Sridhar Published on 1 Feb 2023 4:45 AM GMTమాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. 1 ఫిబ్రవరి 2023 నాడు భీష్మ ఏకాదశి. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. భీష్ముడు స్వయంగా చెప్పినది విష్ణు సహస్రనామం. దీన్ని భీమ ఏకాదశి అని, భీష్మపంచక వ్రతం, భీష్మతిలపద్మ వ్రతం కూడా అంటారు. భీముడు ఏకాదశి నాడు భోజన ప్రియుడైన కూడా ఉపవాసం ఆచరించడం వల్ల ఆరోజు భీమ ఏకాదశి అని సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. ఈ రోజు నుండి అయిదు రోజులు భీష్మ పంచక వ్రతము పేరుతో భీష్మునికి తర్పణములు ఇవ్వాలని వారు తెలిపారు. భీష్ముడితో పాటు విన్నవారిలో శ్రీకృష్ణుడు. ఒక్కడే కాదు, మహాభారతం రచయిత వేదవ్యాసుడు కూడా అనేక వందలాది మహార్షులు, పంచపాండవులతో కలిసి విన్నారు. ఈరోజునాడే విష్ణు సహస్రనామం పుట్టిన రోజు. అప్పుడు భీష్ముడు కురుక్షేత్రం మధ్య అంపశయ్యంలో అంటే ఒక్కొక్క అంగుళం కూడా బాణాలు చీల్చుకుంటే ఉన్నా అంపశయ్యపై నుండే విష్ణుసహస్రనామ కీర్తన చేసి ఆ స్వామికి ఇష్టమైన మాఘశుద్ధఏకాదశి నాడు స్వీయంగా స్వేచ్ఛామరణాన్ని సాధించిన వాడు. శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం మూడురోజుల తర్వాత వచ్చే ఏకాదశి ఆ కురువృద్ధుని పేరిట భీష్మఏకాదశి అనేపేరు వచ్చింది.
గంగానది మానవజన్మ ఎత్తేందుకు భూలోకానికి వచ్చినారు. మహాభారంతంలోని ఆదిపర్వం లో పూర్వజన్మలో భీష్ముడు మునిశాపం పొందిన అష్టవసువులలో ఒకరి తల్లి కడుపున పుడితేమనుకున్నాడు. వసువులు గంగమ్మతో పుట్టగానే తనలో కలుపుకుని మోక్షం ప్రసాదించమని కోరారు. మొదటి ఏడుగురు వసువులు తమ ఆయుష్షులో కొంత భాగం ఆఖరి వసువుకు ధారపోశారు. కాని కనీసం గంగమ్మ ఒక్క బిడ్డ మాత్రం దీర్ఘాయుష్షు ఇమ్మని కోరారు. అప్పడికి మానవరూపంలో గంగానది భువికి దిగివచ్చిన చూసి మోహిస్తాడు మహారాజుడు శంతనుడు. ఆమెను వివాహం చేసుకుంటా గంగ ‘నేనేం చేసినా అడ్డుచెప్పకూడదంటూ, ఆ పని చేస్తే మరుక్షణం నిన్ను వీడి వెళ్ళానని అనే షరతువిధించారు. శంతనుడితో గంగని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గంగాదేవి తమకు పుట్టిన ప్రతిబిడ్డనూ గంగ పాలు చేసారు. ఏడుసార్లు సహించినా శంతనుడు ఎనిమిదోసారి ఆమెను వారిస్తాడు. దాంతొ శంతనుడితో గంగ వదిలేసింది. అయినా ఆ బిడ్డను పెంచి సకల విద్యలూ నేర్పించి భర్తకు అప్పగిస్తానన్నాడు. ఆ మహావీరుడే భీష్ముడు. ఆయన తండ్రి దాశరాజు కుమార్తె సత్యవతిని వివాహమాడాలన్న తన తండ్రి శంతనుడు అడిగినారు. కాని దాశరాజు కూతురే మహారాజు కావాలని షరతు విధించారు. ‘భీష్ముడు ఉండగా తన కూతురి బిడ్డలకు రాజయోగం ఉండదు‘ అని శంతనుడు బాధ పడ్డాడు. సింహాసనంపై వ్యామోహం ఉంటుంది. కాని ఆ చిరువయసులోనే ఆ మోహాన్ని జయించగలిగాడు భీష్ముడు శంతన గురించి ప్రేమించాలని తెలుసుకుని తానసలు పెళ్ళే చేసుకోనని ప్రతిజ్ఞ చేస్తాడు. దాన్నే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. కొన్ని కాలం తరువాత ఆమెకు పుట్టిన బిడ్డల్లో చిత్రాంగదుడు గంధర్వులతో పోరులో మరణిస్తాడు. రెండోకొడుకు విచిత్రవీర్యుడు క్షయరోగి. పెళ్లి చేసుకోవారు లేరు. స్వయంవరం ప్రకటించిన కాశీరాజు భీష్ముడే ఆ కన్నెలు ముగ్గురిని బలవంతంగా తీసుకోచ్చేస్తాడు. పెద్దన అంబ మరొక వీరుణ్ని ప్రేమించిందని తెలుసుకుని ఆమెను మిగతా ఇద్దరినీ విచిత్రవీర్యుడికిచ్చి వివాహం చేస్తాడు. కాని దురదృష్టవశాత్తూ విచిత్రవీర్యుడు చనిపోయారు. అంబికకూ, అంబాలికకూ పుత్రయోగం కలిగించి వంశాన్ని కాపాడమని భీష్ముణ్ని అడుగుతుంది సత్యవతి. కాని తన ప్రతిజ్ఞకే కట్టుబడతాడు గాంగేయుడు. వ్యాసుడిద్వారా అంబిక అంబాలికలకు సద్యోగర్భం ద్వారా సత్యవతి ధృతరాష్ట్రుడు గుడ్డివాడితో, పాండురోగంతో పాండురాజు పుడతారు. గాంధార దేశాధిపతి సుబలుణ్ణి భయపెట్టి భీష్ముడు అతనికుమార్తె గాంధారిని తీసుకొచ్చి దృతరాష్టుడికిచ్చి పెళ్ళిచేస్తాడు. ఆతరువాత కాలం గతిలో వారికొడుకు ధృతరాష్ట్రుడు చూస్తున్నా ద్రౌపదికి నిండుసభలో ధుర్యోదనుడు అవమానం జరుగుతుంటే భీష్ముడు ఉపేక్షిస్తాడు. ‘ఆనాడు నేను రాజధర్మానికి కట్టుబడ్డాను. వారికి నేను సంరక్షుకుడిని, సేవకుడిని‘ అని సమాధానమిస్తాడు భీష్ముడు. ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట.
యుధ్దం ముగిసిన తరువాత కొన్నాళ్లు హస్తినాపురంలో కృష్ణుడు ఉన్నకాలంలో కురుక్షేత్రంలో అర్జునుడు తనకు శ్రీకృష్ణుడికి ఏం చెప్పాడని ధర్మరాజు అడిగితే, చెప్పగలనా ఆలోచించి శ్రీకృష్ణుడినే అడిగితే సరిపోతుంది కదా అన్నాడట. ఇద్దరూ కలిసి శ్రీకృష్ణుడిని కనిపించారు. అప్పుడు ఆ పరమాత్ముడు ధ్యానమగ్నంలో ఉన్నారు. మీరు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నారని అడిగారట. ‘‘నేను నాకోసం భీష్ముడు ధ్యానం చేస్తున్నాడు. కనుక ఆయనను ధ్యానం చేస్తున్నాను. అయ్యో నాకోసం విలపిస్తున్నారా అనుకుంటారు. ఆశ్చర్యపోయి ‘బావా మీరు విలపిస్తున్నారా’ అని యుధిష్టురుడు, అర్జునుడు అడిగారు.
45 రోజులు భీష్ముడు ఎందుకు అంపశయ్యపై ఉన్నాడు
జీయర్ స్వామి మరుకొన్ని వివరణలు ఇచ్చినారు. భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాల్లూ అంపశయ్యపై పడి ఉన్నాను'అని చెప్పాడు. అంటే తాను కోరుకున్నప్పుడు చనిపోగల వరం ఉండి భీష్ముడు బాధపడతాడు. అయినా ఎందుకు భీష్ముడు అంపశయ్యపై శరీరాన్ని శుషింపజేసుకున్నాడు. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు.
‘‘అవును. నా పరమ భక్తుడు, ప్రియ భక్తుడు నన్నే ప్రార్థిస్తున్నాడు. జపిస్తున్నాడు. తపిస్తున్నాడు. నేను సారథినిగా, అర్జునుడు, అన్నగారు యుధిష్టురుడు కూడా దెబ్బతీయడానికి వచ్చిన వారిమే. ఆయినా నన్ను పరమాత్మునిగా ప్రార్థిస్తున్నాడు. సరేలే మీరెందుకడిగారు’’ అని అడిగారు. ‘‘కురుక్షేత్రం మీరు గీతా బోధించినా మాకు అర్థం కాలేదని అన్నకు చెబుతున్నాను. వివరాలు అడుగుదామనుకుంటున్నాను. అంతే కాదు సకలమైన సమస్త జ్ఞానాన్ని చెప్పగలిగిన వాడు భీష్ముడు. అంపశయ్యపై ఉన్న ఆయన్ను కలుద్దాం పదండి, మాట్లాడదాం అడగండి’’ అని ఇంకా చాలా అందరినీ కలిసి వెళ్లారు. పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ
"మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః"
కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది.
'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.
యుధిష్ఠిరునకు అడిగితే భీష్ముని ఆశ్రయించి అనితర జ్ఞాననిలయమైన ధర్మాన్ని, నీతిని తెలిసికొనమని వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడుని కూడా ఆదేశించారు. "ప్రభూ! క్షతగాత్రుడనైన నా బుద్ధి, శక్తి క్షీణించినవి. క్షమించాలని’’ భీష్ముడు అడుగుతాడు. సరే నేను మరునాడు కనబడుతాను అంటాడు. అంతా మళ్లీ మరునాడు వెళ్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తాడు "భీష్మా! నా ప్రభావము చేత నీ క్లేశములన్నీ ఇపుడే తొలగిపోవును. సమస్త జ్ఞానము నీ బుద్ధికి స్ఫురించును. నీచేత నేను ధర్మోపదేశాన్ని చేయిస్తాను" అని. భీష్ముడు అంపశయ్యపైనుండే యుధిష్ఠిరుడికి సమస్త జ్ఞాన, ధర్మములను వివరిస్తాడు. అప్పుడు చెప్పిన అనేకానేక శాస్త్రాలతో విష్ణు సహస్రనామాన్ని కూడా ఉపదేశించారు. మీరే మాకు చెప్పవచ్చు కదా, మళ్లీ నాతోనే చెప్పించడం ఎందుకు అన్నారట. నేను ఒక సారి అర్జునుడికి వివరించాను. భీష్ముడివంటి ఉత్తముడు, అందరికన్న పెద్దవాడు దొరకడన్నారు. పూర్తిగా వినడమే కాదు. వినడం మాత్రమే కాదు, భీష్ముడు చెప్పినదంతా విని అవునన్నాడు శ్రీకృష్ణుడు. అవునా అంటే అవునని అన్నవాడు పరమాత్ముడు. అందరికన్నా శ్రధ్ధగా విన్నవారులొ ఒకరుగా శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు, మహర్షులు, అని ఎందరో వచ్చి విన్నారు.
ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది.ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి
"మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః"
అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.
భీష్ముడి చేసిన పాపం ఏమిటి?
ఏ దోషం చేసాడు? భీష్ముడి తను చేసిన దోషం ఒకటి స్పష్టం. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదంటూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి వివరించారు. ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట
"మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః"
హే ద్రౌపతి! ఇత్రులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. కనుక మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అదే చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని రక్షించాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పాడేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్న అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.
హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈ నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు.
శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు అన్నాడు జీయర్ స్వామి.
అంత్యకాలంలో హరినామస్మరణ చేస్తేనే మోక్షం లభిస్తుందని ప్రసిద్ధి. అలాంటిది ఆ వాసుదేవుణ్ణే ఎదురుగా పెట్టుకుని వేయినామాలతో కీర్తించిన అదృష్టవంతుడు భీష్ముడు. అవే అనంతరకాలంలో విష్ణుసహస్రనామాలుగా ప్రసిద్ధికెక్కడంవిశేషం. అందుకే భీష్ముడు మరణించిన మాఘశుద్ధ అష్టమినాడు, తర్వాత వచ్చే ఏకాదశినాడు విష్ణుసహస్రనామం పఠిస్తే సకల శుభాలు చేకూరుతాయని భావిస్తారు భక్తులు.
భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు.అదే నీటిని మెఘ వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు ఉందని, ముఖ్యంగా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లి తండ్రులను, గురువులను భక్తీ పూర్వకంగా స్మరించి తదుపరి, ఈ దివ్య నామములను జపిస్తూ తేజో మయుడైన, పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తుల మవుదామని జీయర్ స్వామి.