గోదా గోవింద గీతం : దానవ వైరుల తరిమికొట్టెడు సత్య బల పరాక్రముండు

Satya Bala is the valiant one who chased away the demonic enemies.ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు

By M Sridhar  Published on  4 Jan 2023 1:57 AM GMT
గోదా గోవింద గీతం : దానవ వైరుల తరిమికొట్టెడు సత్య బల పరాక్రముండు

ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు

కప్పమ్ తవిర్ క్కుమ్ కలియే తుయిలెజాయ్

శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్, శెట్రార్ క్కు

వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెజాయ్

శెప్పన్న మెన్ ములై శెవ్వాయ్ శిఱు మరుంగుల్

నప్పిన్నై నంగాయ్ తిరువే తుయిలెజాయ్

ఉక్కముమ్ తట్టొళియుమ్ తందు ఉన్ మణాళనై

ఇప్పోదే ఎమ్మై నీరాట్టేలో రెంబావాయ్


భావార్థ గీతిక

ముక్కోటి దేవుళ్లు ముప్పు వచ్చెనంచు విన్నవించకమున్నె

దానవ వైరుల తరిమికొట్టెడు సత్య బల పరాక్రముండు

పోయిన రాజ్యాల కట్టబెట్టు, మేము ముక్కోటి కన్నతక్కువనా

మృతిని జయింప సురలు తాగిన సుధ మాకుత్త ఉప్పునీరు

భగవదనుభవమే అమృతమ్మురాజ్యాలు గీజ్యాలు అడగబోము

మమ్ముబాధించువారుగాక నీకు వైరులెవరు వేరె వైకుంఠనాథ

మధురాధరి కలశస్తని తలోదరి నీళ నీవె మా లక్ష్మివమ్మ

అద్దము వింజామర కన్నయ్య స్నాన సాంగత్యమీయవమ్మ

నీకంటూ నారాయణుడికి వేరు శత్రువులు లేరు. కాని నీ భక్తులకు శత్రువులు నీ శత్రువులే అని భావించి వారినుంచి రక్షిస్తావు

అర్థం : "ముప్పత్తు మూవర్ అమరర్కు" ముప్పై మూడు వర్గాల దేవతలను "మున్ శెన్ఱు" ఆపద రావడానికి ముందే వెళ్ళి కాపాడే "కప్పం తవిర్కుం కలియే!" గొప్ప బలం కలవాడివే "తుయిల్ ఏరాయ్" లేవవయ్యా. "శెప్పం ఉడైయాయ్! " సత్య పరాక్రమశాలీ, ఆడిన మాట తప్పని వాడా, నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి, మాట ఇచ్చి, ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా, ఏమైంది నీ మాట. " తిఱలుడైయాయ్" సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా!, "శేత్తార్కు వెప్పమ్కొడుక్కుం విమలా!" శత్రువులకు దుఖాఃన్ని ఇచ్చే నిర్మలుడా, ఏ దోషం అంటని వాడా. "తుయిల్ ఎరాయ్" నిద్ర లేవయ్యా. నిన్న అమ్మను కొంచం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారు ఇలా. "శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్" సమమైన అంగ సౌష్టవ సౌందర్యం కల్గి, "నప్పినై" స్వామి సంబందంతో 'నంగాయ్' పరి పూర్ణమైన అందం కలదానా! "తిరువే!" సాక్షాత్తు నీవే లక్ష్మివి "తుయిలెరాయ్" మేల్కోవమ్మా. అమ్మ ఏంకావాలని అడిగింది. "ఉక్కముమ్" స్నానానికి తర్వాత పట్టిన స్వేదాన్ని వదిలించే విసనకర్ర కావాలి, "తట్టొళియుమ్"స్నానం తర్వాత అలకరించు కోవడానికి ఒక నిలువుటద్దం కావాలి, " తందు" ఈ రెండు ఇచ్చి "ఉన్మణాళనై" నీ స్వామిని 'ఇప్పోదే' ఇప్పుడే 'ఎమ్మై' మాతో కలిపి "నీరాట్టు" నీరాడించు.

- మాడభూషి శ్రీధర్

Next Story