గోదా గోవింద గీతం : రాకాసిరాజు రావణు పదితలలు గిల్లివేసె రామమూర్తి

Ravana ten-headed Gillivese Ramamurthy.పుళ్లిన్ వాయ్ కీండానై పొల్లా అరక్కనై

By M Sridhar  Published on  28 Dec 2022 7:30 AM IST
గోదా గోవింద గీతం : రాకాసిరాజు రావణు పదితలలు గిల్లివేసె రామమూర్తి

పుళ్లిన్ వాయ్ కీండానై పొల్లా అరక్కనై

క్కిళ్లిక్కళైందాననై కీర్తిమై ప్పాడి ప్పోయ్

పిళ్లైగళ్ ఎల్లారుమ్ పావై క్కళం పుక్కార్

వెళ్లి ఎఝుంద్ వియాజమ్ ఉరంగిట్రు

పుళ్లుం శిలంబిన్ కాణ్ పోదరి కణ్ణినాయ్

కుళ్ల క్కుళిర కుడైందు నీరాడాదే

పళ్లికిడత్తియో పావాయ్ నీనన్నాళాల్

కళ్లమ్ తవిర్ న్దు కలందేలో రెంబావాయ్


భావార్థ గీతిక

రాకాసికొంగ ముక్కుచీల్చివేసె రాజగోపాల కృష్ణమూర్తి

రాకాసిరాజు రావణు పదితలలు గిల్లివేసె రామమూర్తి

రామకథలు రాసలీలలు భజించు కన్నెపడుచులెల్ల

గగనాన గురుడు క్రుంగి శుక్రుడుదయించు శుభవేళ

పక్షులకలరవములు వినవేల పంకజాక్షి పలుకవేల

మనసెల్ల మాధవుగోరుచు పైకి నిద్రనటించుటేల

మేను జిల్లనగ యమున జలాలనీవు మునగవేల

నటనజాలించి నళినాక్షి రావమ్మవ్రతము జేయ

శ్రీరాముడిని శ్రీ కృష్ణుడిని కీర్తిస్తారు. తొండరడిప్పొడియాళ్వార్ కూడా తన తిరుమాలై గ్రంధంలో రామకృష్ణులను సమంగా స్తుతిస్తారు. కొంగ దంభానికి, రావణుడు అహంకారానికి ప్రతీకలు.

అర్థం : పుళ్లిన్ వాయ్= కొంగ (బకాసురుని) నోటిని, కీన్దానై =చీల్చిన శ్రీకృష్ణుని, పొల్లా=దుష్టుడైన: అరక్కనై = రావణాసురుడి తలలను, క్కిల్లి = త్రుంచి, క్కళన్దానై= పారవేసినశ్రీరాముని, కీర్తిమై= కీర్తిని, పిళ్లెగళ్ = పిల్లలు, ఎల్లారుమ్= ఎల్లరును, ప్పాడి=గానం చేసి, ప్పోయ్= వెళ్తూ, పావైక్కళం = వ్రతం చేసే ప్రదేశాన్ని, పుక్కార్ =ప్రవేశించారు. వెళ్లి=శుక్రుడు, ఎజుందు=ఉదయించి, వియాజమ్ గురు(వారం) అస్తమించాడు, పుళ్లుమ్ =పక్షులును, శిలంబినకాణ్= కిలకిలరావములు చేస్తున్నాయి, పోదు= తామరపుష్పంలోని, అరి= తుమ్మెదల వంటి, కణ్ణినాయ్=కన్నులున్నదానా, పావాయ్= ఓ సుకుమారి, నీ= నీవు, నన్నాళాళ్= ఈ మంచి రోజున, కుళ్లక్కుళిర = చల్లచల్లగా, కుడైందు= అవగాహనం చేసి, నీరాడాదే= స్నానం చేయకుండా, పళ్లిక్కిడత్తియో=పాన్పుపై పడుకొని ఉన్నావా? కళ్లమ్= కపట స్వభావాన్ని, తవిర్ న్దు= వదిలి, కలన్దు =మా తో చేరు.

- మాడభూషి శ్రీధర్

Next Story