గోదా గోవింద గీతం : నవరత్న ఖచిత స్వర్ణ దీపస్థంభములు కాంతులీన

Navratna pure golden lamp posts are lit.తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ

By M Sridhar  Published on  24 Dec 2022 2:07 AM GMT
గోదా గోవింద గీతం : నవరత్న ఖచిత స్వర్ణ దీపస్థంభములు కాంతులీన

తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ

ధూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్

మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్

మామీర్! అవళై యెళుప్పీరో ఉన్ మగళ్ దాన్

ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో

ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?

మామాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్రెన్రు

నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్ !


భావార్థ గీతిక

నవరత్న ఖచిత స్వర్ణ దీపస్థంభములు కాంతులీన

ధూపసుగంధ పుప్పొడుల మెత్తని పట్టు పరుపుపైన

హాయిగా శయనించు మామ కూతురా లేవవమ్మ

చిరుగంటలు వేలాడు మణిద్వారాలగడియ తీయవమ్మ

అత్త నీవైన బిడ్డనులేపవమ్మ, ఆమె వినదా మూగదా

మాయలేవైన సోకెనా మత్తుమందేమైన జల్లిరా యేమి,

మాయావి మాధవుని వైకుంఠవాసుని గొంతెత్తి కీర్తించి

గరుడవాహనునోముకై కలిసిరమ్మని గట్టిగాజెప్పవమ్మ

శ్రీమతే రామానుజాయనమః మంత్రపూతమైన పాశురం. జీవుడు ఆధేయం పరమాత్మ ఆధారం

అర్థం : తూమణి మాడత్తు=స్వచ్ఛమైన సహజమైన మణులచేత నిర్మించిన భవనంలో, చుట్రుం= చుట్టూ..అంతటా, విళక్కు ఎరియ=దీపాలు వెలుగుతూ ఉండగా,దూపం కమఝ=సుగంధ ధూపాలు వ్యాపిస్తుండగా, త్తుయిల్ అణైమేల్=పడుకున్నవెంటనే నిద్రవచ్చేంత మెత్తని పడకపై, కణ్ వళరుమ్=కనులుమూసుకుని నిద్రిస్తున్న, మామాన్ మగళే=మామకూతురా, మణిక్కదవమ్=మణులతో నిర్మించిన తలుపు, తాళ్=గడియను, తిఱవాయ్=తెరవవోయ్, మామీర్ = ఓ అత్తా, అవళై ఎఝుప్పీరో= నీ కూతురును లేపవమ్మా, ఉన్ మగళ్ దాన్= నీకూతురు ఏమైనా, ఉమైయో=మూగదా, అన్ఱి=లేకపోతే, చ్చెవిడో=చెవిటిదా, అనన్దలో= అలసిపోయి నిద్రిస్తున్నదా, ఏమప్పట్టాళో =కావలిలో ఉంచినారా, పెరుందియిల్= చాలా సేపు నిద్రపోయేట్టు, మందిరప్పట్టాళో=మంత్రం చే కట్టుబడి ఉన్నదా, మామాయన్=మహామాయావీ, మాదవన్=మాధవుడా, వైగుందన్= వైకుంఠవాసా, ఎన్ఱు ఎన్ఱు= అని మళ్లీ మళ్లీ, పలవుమ్= సహస్రాధికమలైన అతని, నామమ్ భగవన్నామాలను, నవిన్ఱు=కీర్తించాము.

- మాడభూషి శ్రీధర్


Next Story