గోదా గోవింద గీతం : మణిరత్నఖచిత తలుపుగడియలు తెరచి రానిమ్ము
Mani Ratna Kachita doorbell open chasi ranimmu.కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ
By M Sridhar Published on 31 Dec 2022 7:38 AM ISTకోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్
భావార్థ గీతిక
నాయకులకెల్ల నాయకుడు నందగోపుని భవ్యభవన
ధ్వజతోరణోజ్వల ద్వారములగాచు రక్షకోత్తమా
మణిరత్నఖచితతలుపుగడియలు తెరచి రానిమ్ము
నీలవర్ణుడు పరమునిచ్చెదనని మాట ఇచ్చినాడు
వైకుంఠపథము జేరు మార్గమ్ము మాకు జెప్పునోయి
మాయలెరుగము గోపాలగోపికా భక్తులము మేము
ద్వారపాలకా మున్ముందె కాదనక గడియ తీయవయ్య
శుచులమై వచ్చితిమి శ్రీకృష్ణ దర్శనమ్మీయవయ్య
భగవంతుడిని దుష్టుల కంటపడకుండా కాపాడిన వాడు. ఆచార్యుడు అదే పని చేస్తాడు
అర్థం : నాయగన్ ఆయ్ నిన్ఱ = మాకందరికీ నాయకుడైన, నందగోపన్ ఉడైయ=నందగోపుని యొక్క,కోయిల్ = భవనాన్ని, కాప్పానే! =కాపాడే వాడా, కొడిత్తోన్ఱుం ప్రకాశించే ధ్వజాలతో, తోరణవాశల్ = తోరణాలతో అలంకరించిన ద్వారాన్ని, కాప్పానే= కాపాడేవాడా, మణిక్కదవం మణులతో తాపడం చేసిన తలుపులు, తాళ్ = గడియను, తిఱవాయ్= తీయవలెను, ఆయర్ శిఱుమియరోముక్కు =గోపబాలికలమైన మాకు,అఱై పఱై = మ్రోగే పరై అనే వాయిద్యాన్ని, మాయన్ =ఆశ్చర్యకరమైన మాయలు చేసిన వాడు, మణివణ్ణన్ నీలమణుల వంటి మేనిఛాయగలవాడు, నెన్నలే =నిన్ననే, వాయ్-నేరుందాన్ =వాగ్దానం చేశాడుతూయోమాయ్ వందోం =పరిశుద్ధులమై వచ్చినాము, తుయిలెర ప్పాడువాన్= మేలుకొల్పడానికి వచ్చాము,వాయాల్ = నీ నోటితో, మున్నం మున్నం = ముందే కాదనకమ్మా, మాత్తాదే అమ్మానీ నేశనిలైక్కదమ్ = శ్రీకృష్ణునిపై ప్రేమాభిమానాలతో నిండిన తలుపును, నీక్కు=తెరువుము.