గోదా గోవింద గీతం : లోపమేమిలేని లోకాలనాథుడే మాకన్నయ్య
Makannayya is the world's unblemished man.కఱవైగళ్ పిన్ శెన్ఱు కానమ్ శేర్ న్ద్ ఉణ్బోమ్
By M Sridhar Published on 12 Jan 2023 7:18 AM ISTకఱవైగళ్ పిన్ శెన్ఱు కానమ్ శేర్ న్ద్ ఉణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱున్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో
డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్
భావార్థ గీతిక
అడవులందు మేతపశువులకు నేతలము మేము
ఆలమందల వెంట దిరుగు అల్పజీవులమేము
పసులు పక్షులతోడనే మెసలెదము మెసవెదము,
తెలివి లేమిగల గొల్లల నీవు బుట్టుటే మాభాగ్యమోయి
లోపమేమిలేని లోకాలనాథుడే మాకన్నయ్య అయిన
ఎన్నడెడతెగని కృష్ణ బంధమే మాకెనలేనివరము
మర్యాదలెరుగక ఇన్నాళ్లు చులకనగ పిలిచినాము
అలగక కృష్ణయ్య, ఆశయాల దీర్ప ఆదరించవయ్య
నిన్నేకోరుకున్నాం. మాకే ఉపాయాలూ తెలియదు. నిన్నే ఉపాయంగా నమ్ముకుని వచ్చాం. పఱై పొందడానికి సాధనానుష్టానంచేసి యోగ్యత తెచ్చుకున్నామో లేదో కూడా తెలియదు. మాకే యోగ్యతాలేదు.
అర్థం : లోపమనేదేలేని గోవిందా (కుఱవొన్ఱుమిల్లాద గోవిందా) మేము (యామ్) పశువుల వెంట నడిచి (కఱవైగళ్ పిన్ శెన్ఱు) అడవిలో కలుసుకుని (కానమ్ శేర్ న్దు) తిని తిరుగుతూ ఉంటాం (ఉణ్ బోమ్) ఏమాత్రం వివేకంలేని (అఱివు ఒన్ఱుమ్ ఇల్లాద) యాదవకులంలో (ఆయకులత్తు) నిన్ను (ఉన్ దన్ను) మా వంశంలో పుట్టిన (ప్పిఱవి పెఱుందనై) పుణ్యాన్ని (పుణ్ణియమ్) పొందియున్నాము (ఉడైయామ్), ఓ దేవా (ఇఱై) నీతో మా సంబంధం (ఉన్ దన్నోడు ఉఱవు) ఇక్కడ మనకు (ఇంగు నమక్కు) పోగొట్టుకుందామన్నా పోయేది కాదు (ఒజిక్క ఒజియాదు) లోకజ్ఞానం లేని పిల్లలం (అఱియాద పిళ్లైగళోమ్) నిన్ను(ఉన్ దన్నై) ప్రేమతో (అన్బినాల్) చిన్న పేరుతో పిలిచినందుకు (శిరుపేర్ అజైత్తనవుమ్) నీవు (నీ) కోపించి అనుగ్రహించకుండా వదలకు (శీఱి అఱుళాదే) మేము ఆశించిన ప్రయోజనాన్నిమ్ము (పఱైతారాయ్).