గోదా గోవింద గీతం : అహంభావము వీడి నీవె శరణనుచు జేరినాము

Let go of ego and take refuge in you.అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన

By M Sridhar  Published on  6 Jan 2023 7:31 AM IST
గోదా గోవింద గీతం : అహంభావము వీడి నీవె శరణనుచు జేరినాము

అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన

బజ్ఞ్గమాయ్ నన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే

శజ్ఞ్గమిరుపార్ పోల్ వన్దుతలై ప్పెయ్ దోమ్

కింగిణివాయ్ చ్చెయద తామరప్పూప్పోలే

శెంజ్ఞ్గణ్ శిరిచ్చిరిదే యేమ్మేల్ విళియావో

తింగళు మాదిత్తియను మెళున్దార్పోల్

అజ్ఞ్గణ్ణిరణ్డుం కొండు ఎజ్ఞ్గళ్ మేల్ నోక్కుదియేల్

ఎజ్ఞ్గళ్ మేల్ చాబ మిళన్దేలో రెమ్బావాయ్.

తెలుగు భావార్థ గీతిక

విపులాచ పృథ్విపై భూములేలెడు రాజుల మెల్ల కదలి

గుంపులు గుంపులుగా గూడి నీ పాదపీఠము కింద

అహంభావము వీడి నీవె శరణనుచు జేరినాము

చిరుమువ్వ అరవాయి, అరవిరియు కమలమ్మువోలె

ఒక కంటరవి, మరొక కంట శశి ఏకకాలాన వచ్చినట్టు

వాత్సల్యమెరుపైన కన్నుఅరవిచ్చి చూడవయ్య

ఆచూపుసోకిన జాలు మాశాపాలు పాపాలు కాలి పోవు

మాయలెరుగని మాకు నీ చూపులే నోముఫలములయ్య

ఆచార్యుల అనుగ్రహం ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. గోవులకు ఆచార్యులకు ఉదార స్వభావం ఉంది. పిండకుండానే కుండలు నింపే పాలు ఇస్తాయి గోవులు. అడిగిన వెంటనే అపారమైన జ్ఞానాన్ని కురిపించే వారు గురువులు.

అర్థం: అమ్ = అందమైన, కణ్ = విశాలము, మా = పెద్దదీ అయిన ఞాలత్తర్ శర్ =ఈ భూమిని పాలించిన, అర్ శర్ = రాజులంతా, అభిమాన భంగమాయ్ =తమఅహంకారం విడిచి, వందు =వచ్చి, నిన్= నీ, పళ్లిక్కట్టిల్ కీజే = మంచం కింద, శఙ్గం =సంఘములుగా, ఇరుప్పార్ పోల్ = దాసులైఉన్నట్టే, వన్దు = వచ్చి తలైప్పెయ్ దోమ్ =మేము కూడా వచ్చి చేరిపోతిమి, కింగిణి =సిరిమువ్వ గజ్జెల వలె, వాయ్ చ్చెయ్ ద = నోరు తెరిచినట్టు, తామరైప్పూప్పోలే = తామర పూవుల వలె, శెమ్ కణ్ = వాత్సల్యచు చేత ఎర్రనైన నేత్రములను, శిణిచ్చిఱిదే = నెమ్మదినెమ్మదిగా కొద్దికొద్దిగా, ఎమ్మేల్ = మాపైన, విజియావో = ప్రసరింపచేయవా, తింగళుం= చంద్రుడూ, అదిత్తియమం= సూర్యుడూ, ఎజన్దార్ పోల్ = ఒకేసారి ఉదయించినట్టు చల్లని కాంతులీనుతూ, ఇరణ్డుం కొండు = రెంటిలోనూ, ఎంగళ్ మేల్ = మాపైన, నొక్కుదియేల్= చూపినట్టయితే, ఎంగళ్ మేల్ = మాపైనున్న, శాపమ్ = పాపములన్నీ నశిస్తాయి, ఏల్ ఓర్ ఎం పావాయ్ = ఇదే మా గొప్ప నోము.

Next Story