గోదాగోవింద గీతం : నోములెన్నొనోచి కృష్ణసంస్పర్శస్వర్గాన తేలుతున్నావా
Knowing narayana is doing vows.నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
By M Sridhar Published on 25 Dec 2022 7:33 AM ISTనోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్
భావార్థ గీతిక
నోములెన్నొనోచి కృష్ణసంస్పర్శస్వర్గాన తేలుతున్నావా
తలుపు తెరవకున్నపోనిమ్ము పలుకైన పలుకవేమి
కిరీటి, తులసీ దామపరిమళాలు జిమ్ము నారాయణుండు
పల్లాండు పాడిన పరవశించు పరమానందమూర్తి
పఱై నిచ్చి పర తత్త్వజ్ఞానమ్ము కూడా బోధించువాడు
రామబాణహతుడు కుంభకర్ణుడు నిద్రలో నీచేత ఓడెనా
నారీ రత్నమా మత్తులో తొట్రుపడక నెమ్మదిగ
గడియ తీయరమ్ము, నోము కై మా తోడ కలిసి రమ్ము.
శ్రీ కృష్ణానుభవం, శ్రీ కృష్ణ సంశ్లేషమే, స్నానం. ఆయనే ధ్యానం. ఆయనే నిద్ర, సర్వస్వం కూడా.
అర్థం : నోట్రు= నోము నోచి, సువర్గమ్ పుగుగిన్ఱ = స్వర్గాన్ని ప్రవేశిస్తున్నంత సుఖాన్ని ఎడతెగక అనుభవిస్తున్న, అమ్మనాయ్= అమ్మా, వాశల్= వాకిలి తలుపు, తిఱవాదార్= తీయని వారు, మాట్రముమ్ తారారో= ఒక బదులు మాటైనా మాట్లాడరా, నాట్రత్తుఝాయ్ ముడి = పరిమళాలు గుబాళిస్తున్న తులసీమాలచే అలంకృత కిరీటముగల, నారాయణన్=నారాయణుడు అనే దివ్యనామాంకితుడు, నమ్మాల్= మనచేత, పోట్ర=పల్లాండును,పాడించి, ప్పఱైతరుమ్ = మనకు ప్రాయమైన కైంకర్యాన్ని పఱైని అనుగ్రహించే వాడు, పుణ్డియనాల్= పుణ్యస్వరూపుడైన శ్రీమహావిష్ణువుచే, పండు ఒరునాళ్ = ముందొక కాలంలో, కూట్రత్తిన్ వాయ్ వీఝన్ద = యుముని నోట్లో పడిన, కుంబకరణనుమ్, కుంభకర్ణుడును, ఉనక్కే తొట్రు= నీకు ఇచ్చి వెళ్లాడా, ఆట్ర ఆనందలుడైయాయ్= గాఢమైన నిద్రను కలిగిన దానా, అరుంగలమే =దుర్లభమైన ఆభరణమా, తేట్రమాయ్ వందు= నిద్రమత్తును వదిలిచుకొని వచ్చి, తిఱ=తలుపు తీయి.
- మాడభూషి శ్రీధర్