గోదా గోవింద గీతం : కేశిరాకాసి నోరు జీల్చి. చాణూరముష్ఠుల గూల్చి
Keshirakasi Noru Jeelchi.కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱువీడు,
By M Sridhar Published on 23 Dec 2022 2:08 AM GMTకీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱువీడు,
మెయ్‌వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్,
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు, ఉన్నై
క్కూవువాన్ వందు నిన్ఱోమ్, కోదుకలముడైయ
పావాయ్! ఎழுన్దిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ,
దేవాది దేవనై శెన్ఱు నాం శేవిత్తాల్,
ఆ వా వెన్ఱారాయ్‌న్దరుళేలో రెమ్బావాయ్!
భావార్థ గీతిక
తూరుపుదెలవారు గోధూళివేళ గోవులు కదిలినాయి
దూడలవెంట ఉదయకిరణాల మెరయు గడ్డిమేయ
నీతోడ కలిసిపోవ నీయింటి వాకిట నిలిచినాము
భక్తిమణిదీపమా మావెంట రావమ్మ హరిని జేర
పఱై పరములగోరెడు నోము నోచుదామని చెప్పుదాము
కేశిరాకాసి నోరు జీల్చి. చాణూరముష్ఠుల గూల్చి
లోకాల నాధుడే మాధవుడు మనమధ్య నిలిచె
కృష్ణ సంస్పర్శస్నానాలుజేయ రావమ్మ కృష్ణవేణి.
ఉదయం బాల్యానికి సంకేతం. పగలు యవ్వనం, సాయంత్రం వార్ధక్యం, రాత్రి మరణం, మళ్లీ ఉదయం అంటే మళ్లీ జననం, నవ జీవనం అని దాశరథి రంగాచార్య ఈ పాశుర సారాంశాన్ని వివరించారు.
అర్థం : కీళ్ (కీழ்) =తూర్పుదిక్కున, వానమ్ = ఆకాశం, వెళ్ళు = తెల్లబడ్డది, ఎన్ఱు =అని, ఎరుమై =గేదెలు, శిఱువీడు= చిన్నమేత, మేయ్‌వాన్= మేయుటకై, పరన్దనగాణ్ =వ్యాపించినవి, మిక్కుళ్ళ= మిగిలిన, పిళ్ళైగళుం= పిల్లలునూ, పోవాన్=పోవుటయే ప్రయోజనముగా, పోగిన్ఱారై = పోవుచుండగ, వారిని, ప్పోగామల్ =అలా వెళ్ళకుండా, కాత్తు=అడ్డి, ఉన్నై=నిన్ను, కూవువాన్ = పిలుచుటకై, వందు = వచ్చి (నీ యింటి ముందర), నిన్ఱోం =నిలిచితిమి, కోదుకలముడైయ=కృష్ణునికి కూడ కుతూహలము కలిగించు
పావాయ్! =యువతీ! ఎళిన్దిరాయ్ (ఎழுన్దిరాయ్!) = లెమ్ము! పాడి = గానము చేయుచూ పఱై =పఱై అనెడి వాయిద్యమును, కొండు=అతడినుంచి స్వీకరించి, మా=అశ్వాసురుని యొక్క, వాయ్ =నోటిని, పిళన్దానై=చీల్చినవానిని, మల్లరై = చాణూరుడు, ముష్టికుడు అనే మల్లురను, మాట్టియ= మట్టి కరిపించిన, దేవాదిదేవనై= దేవతలందరికి ఆరాధ్యుడైన శ్రీకృష్ణుని, శెన్ఱు=దగ్గరకు వెళ్ళి, నామ్= మనము, శేవిత్తాల్ =నమస్కరించినట్లైతే, ఆవావెన్ఱు=అయ్యో! శ్రమపడ్డారా! యని, ఆరాయ్‌న్దు = పలుకరించి, అరుళ్ =అనుగ్రహించును, ఏల్+ఓర్+ఎం+పావాయ్=ఇదే మా గొప్ప వ్రతము.