గోదా గోవింద గీతం : వెడలి లంకాధీశు దునిమిన శ్రీరామ శౌర్యమునకు జయము జయము

Jayaho to Sri Rama who felled Ravana.అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోర్ట్రి

By M Sridhar  Published on  8 Jan 2023 1:53 AM GMT
గోదా గోవింద గీతం : వెడలి లంకాధీశు దునిమిన శ్రీరామ శౌర్యమునకు జయము జయము

అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోర్ట్రి

శెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోర్ట్రి

పొన్ఱచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోర్ట్రి

కన్ఱుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోర్ట్రి

కున్ఱుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోర్ట్రి

వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోర్ట్రి

ఎన్ఱెన్ఱుమ్ శేవకమే యేత్తి ప్పఱైకొళ్వాన్

ఇన్ఱు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్


భావార్థ గీతిక

ఆనాడు రెండడుగుల లోకాల గొలిచిన పాద యుగళికి జయము జయము

వెడలి లంకాధీశు దునిమిన శ్రీరామ శౌర్యమునకు జయము జయము

శకటాసురుని దన్ని శిథిలమ్ముజేసిన శౌరికీర్తికిని జయము జయము

వత్సము విసిరి కపిత్థము కొట్టు పాదభంగిమకు జయము జయము

అరివీరుల ధైర్యమల్ల హరించు హరి శూలమునకు జయము జయము

కొండగొడుగు జేసి గోవులగాచిన గోవిందు దయకు జయము జయము

పోరున పరులతలలు తెంచి కేలనొప్పు చక్రమునకు జయము జయము

పరము వరమునిచ్చిమానోము నిల్పిన వరదునికి జయము జయము

గోదాదేవి పరమాత్ముడి పాదాలకు రక్ష కట్టి మంగళం పాడుతున్నారు. జగద్రక్షకుడిని తాము రక్షకట్టి కాపాడుకోవాలనుకుంటున్నారు. ఇది ప్రేమ తప్ప మరొకటి కాదు.

అర్థం : అన్ఱు=ఆనాడు, ఇవ్వులగం=ఈ లోకమును, అళన్దాయ్! =కొలిచితివే! అడి =ఆ నీ శ్రీపాదమునకు, పోత్తి =మంగళము, శెన్ఱు=వెళ్ళి, అంగు=అక్కడ, తెన్=అందమైన దక్షిణదిశయందున్న, ఇలంగై=ఆ లంకానగరమును, శెత్తాయ్!=నశింపచేసితివితిఱల్=ఆ బలమునకు, పోర్ట్రి=మంగళము, పొన్ఱ=కపట వేషము దాల్చిన, శకటం=శకటాసురుని, ఉతైత్తాయ్ =తన్నితివి, పుకழ= ఆ నీ కీర్తికి, పోత్తి=మంగళము, కన్ఱు= దూడవేషం దాల్చిన వత్సాసురుని, కుణిలా = గోటీబిళ్ళవలె, ఎరిన్దాయ్ = విసరివేసితివి, కழల్ = నీ పాదభంగిమకు, పోత్తి = మంగళము, కున్ఱు = పర్వతమైన గోవర్ధనగిరిని, కుడైయా = గొడుగువలె, ఎడుత్తాయ్! = ఎత్తితివి, కుణం = ఆ నీ సహన గుణమునకు, పోత్తి = మంగళము, వెన్ఱు = జయించి, పగై = శత్తువులను, కెడుక్కుం = నశింపచేయు, నిన్ = నీయొక్క, కైయిల్ = చేతియందలి, వేల్ = బల్లెమునకు, పోత్తి = మంగళము, ఎన్ఱెన్ఱు = ఈ విధముగా, ఉన్ = నీ యొక్క, శేవగమే = వీర చరితలనే, ఏత్తి = స్తుతించి, పఱై కొళ్వాన్ = పఱై అను వాయిద్యవిశేషమును ఇన్ఱు = ఈ వేళ, యాం = మేము, వన్దోం= వచ్చితిమి, ఇఱంగు = దయ చూపుమా!ఏల్+ఓర్+ఎం+పావాయ్ = ఇదియే మా గొప్ప వ్రతము.

Next Story