గోదా గోవింద గీతం : శ్రీవిష్ణుచిత్తువిరిబూవు, శ్రీవిల్లిపుత్తూరు శ్రీనోముపంట
Gopikas are shining like moons.వంగ క్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
By M Sridhar Published on 14 Jan 2023 7:00 AM ISTవంగ క్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
తింగళ్ తిరుముగత్తు శేయిరైయార్ శెన్ఱిఱైంజి
అంగ ప్పఱై కొండవాత్తై అణి పుదువై
ప్పైంగమల త్తణ్ తెరియల్ పట్టర్బిరాన్ కోదై శొన్న
శంగ త్తమిర్ మాలై ముప్పదుం తప్పామే
ఇంగిప్పరిశురైప్పర్ ఈరిరండు మాల్ వరైత్తోళ్
శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్
ఎంగుం తిరువగుళ్ పెత్తిన్భుఱువర్ ఎంబావాయ్
భావార్థ గీతిక
ఓడలెన్నొ తిరుగు పాలకడలి చిలికిన మాధవుని కేశవుని
జేరి నోచి చంద్రవదనులు రేపల్లెలో ధన్యులైన రీతి
శ్రీవిష్ణుచిత్తువిరిబూవు, శ్రీవిల్లిపుత్తూరు శ్రీనోముపంట
చిన్నారి పసిడి హస్తాల తామరలమాలలల్లి రంగనికిచ్చి
గోదపాడిన సిరినోము ముప్పది తమిళ పాటల మాల
నోచి పాడిన చాలు తప్పును సంసార పాప కుహరాలు
నాల్గుకొండల కైదండలవాడి అండదండలందరికినందు
సుందరసిరిధర కరుణా కటాక్షానందమగ్నులగుదురెల్ల
మీరు కోరిన అంతరంగ కైంకర్యాన్ని నేను స్వీకరిస్తాను. మీరు పొందిన ఈ మహాభాగ్యం ఇతరులు పొందాలని మీకు ఉందా దానికి మార్గం ఏమిటి’’
అర్థం : ఓడలున్న పాలకడలి (వంగమ్ కడల్) దేవతలకోసం చిలికిన (కడైంద) లక్ష్మీపతిని (మాదవనై) శ్రీకృష్ణుని (కేశవనై) చందమామవంటి అందమైన ముఖాన్ని (తింగళ్ తిరుముగత్తు) సుందరాభరణాలు ధరించిన గోపికలు (చేయిజైయార్) చేరి (శెన్ఱు) నమస్కరించి (ఇఱైంజి), ఆ రేపల్లెలో (అంగు), ప్రసిద్ధమైన (అప్పరైకొండ వాట్రై) పురుషార్థాన్ని పొందిన వృత్తాంతాన్ని (తమ) అందమైన శ్రీ విల్లి పుత్తూరులో (అణి పుదువై) బంగారు కాంతులీనుతున్న తామర పూవులతో చేసిన అందమైన మాలలు గలిగిన పెరియాళ్వారుల కుమార్తె గోదాదేవి (ప్పైంగమల త్తణ్ తెరియల్ పట్టర్బిరాన్ కోదై) చెప్పిన (శొన్న) ఆపాత మధురమైన ముఫ్పై తమిళ గీతాల మాల (శంగ త్తమిర్ మాలై ముప్పదుం) తప్పనిసరిగా (తప్పామే) ఈ భూమిలో (ఇంగు) ఈ విధంగా (ఇప్పరిశు) అనుసంధానం చేసే వారు (ఉరైప్పార్) కొండంత భుజాలు నాలుగు కలిగిన వాడు (ఈరిరండు మాల్ వరైత్తోళ్) ఎరుపైన అందమైన ముఖం కలిగిన వాడును (శెంగణ్ తిరుముగత్తు) ఐశ్వర్య (చెల్వమ్) శ్రీమంతుడైన శ్రీమన్నారాయణుని చే (త్తిరుమాలాల్) అన్ని చోట్ల (ఎంగుం) అతని కరుణా కటాక్షాలను పొంది (తిరువగుళ్ పెట్రు) ఆనంద మగ్నులవుతారు (ఇన్భుఱువర్).
తిరుప్పావైలోని 30 పాశురాలు, నాలాయిర దివ్య ప్రబంధంలో చేర్చకున్నారు. ఆండాళ్ తన 13 వ ఏట తిరుప్పావై రచించారని అంటారు. ఆ తరువాత చాలాకాలానికి ఆమె నాచ్చియార్ తిరుమొజి రచించారు. శృంగార రసబంధురంగా ఉన్నరప్పడికీ భక్తి ప్రాధాన్యం వల్ల నాచ్చియార్ తిరుమొజిలోని 143 పాశురాలు. తొలి స్త్రీవాదం బహుజ వాదం గోదాదేవిదే అయి ఉండాలి. ఒక బ్రాహ్మణయవతి ఆనాటి నిరంకుశ సంప్రదాయాల కాలంలో అసలు వివాహాన్నే తిరస్కరించి, కూడదన్న చదువులు చదివి, శ్రీహరినే ప్రేమించి, కేవలం తనదైన మార్గాన్ని కల్పించుకుని, అందులో నడిచి చివరకు శ్రీరంగనిలోఐక్యం కావడం ఆమెను సాహసోపేతురాలిని చేసింది. ఆ కాలపు స్త్రీధర్మాలనే వాదాలను కాదని, జ్ఞాన భక్తి మార్గాల ద్వారా హరిని అందుకోగలమని ఎనిమిది తొమ్మిదో శతాబ్దం అంటే వేయి పదకొండేళ్ల కిందటి కాలంలో నిరూపించిన వీర వైష్ణవ వీరనారి గోదాదేవి.
- మాడభూషి శ్రీధర్