గోదా గోవింద గీతం : గగనమ్ముచీల్చి లోకాల నిండిన నిత్యసూర నేత నిగమసార
Good Governance by Nanda King.అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
By M Sridhar
అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్
భావార్థ గీతిక
అన్నజల వస్త్రంబులందరికిచ్చు నందగోపాల ఆచార్య
వ్రేపల్లె వేలుపా వేచి ఉన్నారు జనమెల్ల మేలుకొనవయ్య
ప్రబ్బలి ప్రమదల చిగురు యశోద మంత్ర మహిమ
గగనమ్ముచీల్చి లోకాల నిండిన నిత్యసూర నేత నిగమసార
యదు కుల కీర్తి పతాక యశోదానందన యమునావిహార
మెరుగుపసిడికడియాల భాగవతోత్తమ బలరామ దేవ
ద్వయమంత్రముల రూపు కదా మీ సోదర ద్వయము
నీవు నీతమ్ముడును లేచి మమ్మాదరించరయ్య.
అన్నదమ్ములను విడదీసే రాక్షసులు, మనుషుల్లో విభేదాలు సృష్టించి, విభజించి పాలించే దుష్ట పాలకులు, పిల్లలను ఎత్తుకుని పోయే కంసుల వంటి రాక్షసులు.
అర్థం : అమ్బరమే = వస్త్రములు, తణ్ణీరే = చల్లని నీరు,శోఱే = అన్నము, అఱం = ధర్మం, శెయ్యుం= చేయునట్టి ఎమ్బెరుమాన్ = మాస్వామీ, నందగోపాలా! =నంద గోపాల నాయకుడా, ఎరుందిరాయ్ =లేవయ్యా, కొన్బనార్కు ఎల్లాం= ప్రబ్బలి మొక్కవలె యున్న స్త్రీలందరికీ, కొళుందే! =చిగురువలె నుండే దానా, కుల విళక్కే= కులదీపమువంటి దానా, ఎమ్బెరుమాట్టి = మాస్వామినీ, యశోదా! =యశోదమ్మతల్లీ, అఱివుఱాయ్ = నిదురలేవమ్మా, అమ్బరం =ఆకాశమును, ఊడఱుత్తు =మధ్యగా భేదించి, ఓంగి = పెరిగి, ఉలగ = లోకములను, అళంద= కొలిచిన, ఉమ్బర్ కోమానే! = నిత్యసూరులకు రాజయినవాడా, ఉఱంగాదు-= నిదురించరాదు, ఎరుందిరాయ్= మేల్కొనుము. శెమ్ పోల్ కళల్ = ఎర్రని బంగారముతో చేసిన కడియము ధరించిన, అడి= పాదముగల, చ్చెల్వా బలదేవా!= బలరాముడా, ఉమ్బియుం = నీ తమ్ముడును, నీయుం =నీవును, ఉఱంగ్-ఏల్ = మేల్కొనండి.
- మాడభూషి శ్రీధర్