గోదాగోవింద గీతం : పెరటి మడుగులోన చెందమ్మికమలాలు కలిసి విరిసె

Chendammikamalas bloom together in the backyard pond.ఉజ్ఞళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్

By M Sridhar  Published on  29 Dec 2022 2:12 AM GMT
గోదాగోవింద గీతం : పెరటి మడుగులోన చెందమ్మికమలాలు కలిసి విరిసె

ఉజ్ఞళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్

శెజ్ఞరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్

శెజ్ఞల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్

తజ్ఞళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్

ఎజ్ఞళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్

నజ్ఞాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్

శజ్ఞొడు చక్కరం ఏందుం తడక్కైయం

పజ్ఞయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్

భావార్థ గీతిక

పెరటి మడుగులోన చెందమ్మికమలాలు కలిసి విరిసె

నల్లకల్వలు నీవు రావని ముకుళించి మూతిముడిచె

ధవళదంతుల మునులెల్ల తలుపుతెరువ బీగాలతో

కాషాయధారులు శంఖమ్ములూద గుడులకరిగినారు

మమ్మెలేపదమన్న మాట మరిచి నిద్రపోయెదవేల

కెందామరనేత్రుడు శంఖచక్రధరుడు ఆజానుబాహుడు

ఆకాశవర్ణునికి ఆరాధనలు జేసి మంగళమ్ములు పాడ

కదలిరావమ్మ కమలాక్షి కలిసి కృష్ణవ్రతముజేయ

తిరుప్పాణియాళ్వార్ ను మేలుకొలిపే పాశురం ఇది. ఇందులో మాట నేర్పరితనం, ప్రమాణాలద్వారా జ్ఞానం సంపాదించడం ప్రస్తావనకు వస్తాయి.

అర్థం : ఉజ్ఞళ్ = మీ యొక్క, పురైక్కడై త్తోట్టత్తు = పెరటితోటలో, వావియుళ్ =కొలనులో, శెజ్ఞరునీర్ వాయ్ నెగిర్ అంద్ = ఎర్రతామరలు వికసించి, ఆమ్బల్ వాయ్ కుమ్బిన =నల్లకలువలు ముకుళించుకుని ఉన్నాయి. కాణ్= చూడు, శెజ్ఞల్పొడి క్కూరై = కాషాయవస్త్రాలు ధరించిన వారు, వెణ్బల్ =తెల్లని పలువరస గల వారు, తవత్తవర్ =తపసులు, తజ్ఞళ్ తిరుక్కోయిల్ = తమ దైవ సన్నిధిలో, శంగిడువాన్ =శంఖం మోగించడానికి, పోగిన్ఱార్= వెళ్తున్నారు. ఎజ్ఞళై =మమ్మల్ని, మున్నం ఎరుప్పువాన్ = ముందుగానే వచ్చిలేపుతానని, వాయ్ పేశుమ్= నోటితో చెప్పిన, నజ్ఞాయ్! =ఓ పరిపూర్ణురాలా, ఎరుందిరాయ్ = లేచిరమ్ము, నాణాదాయ్! =సిగ్గులేనిదానా, నావుడైయాయ్= తీయని మాటలు గుప్పించే నాలుకగలదానా, శజ్ఞొడు చక్కరం = శంఖ చక్రాలను ఏందుం = ధరించిన, తడక్కైయం = దీర్ఘబాహువులు గలవాడునూ, పజ్ఞయ క్కణ్ణానై = ఎర్రతామరలను పోలిన కన్నులు గలవాడు అయిన సర్వేశ్వరుని, ప్పాడ= స్తుతించడం.

- మాడభూషి శ్రీధర్

Next Story