గోదా గోవింద గీతం : మణిరత్నదీప స్తంభ సంచయముల ధగధగల మధ్య

Amidst the glitter of Mani Ratna Dipa pillars.కుత్తు విళక్కెరియ క్కొట్టుక్కాల్ కట్టిల్ మేల్

By M Sridhar  Published on  3 Jan 2023 2:02 AM GMT
గోదా గోవింద గీతం : మణిరత్నదీప స్తంభ సంచయముల ధగధగల మధ్య

కుత్తు విళక్కెరియ క్కొట్టుక్కాల్ కట్టిల్ మేల్

మెత్తెన్ఱ పంజశయనత్తిల్ మేలేఱి

కొత్తలర్ పూంజ్ఞల్ నప్పిన్నై కొంజ్ఞైమేల్

వైత్తు క్కిడంద మలర్ మార్బావాయ్ తిఱవాయ్

మైత్తడం కణ్ణినాయ్ నీ ఉన్ మణాళనై

ఎత్తనైపోదుమ్ తుయిలెళవొట్టాయ్ కాణ్

ఎత్తనై యేలుమ్ పిరివాట్ర గిల్లాయాల్

తత్తువ మన్ఱు తగవేలో రెంబావాయ్

భావార్థగీతిక

మణిరత్నదీప స్తంభ సంచయముల ధగధగల మధ్య

దంతపు కోళ్ల పట్టెమంచముపైన పట్టుపరుపు మీద

శుభలక్షణాన్విత సుందర సురుచిర శయనమందిరాన

మేను వాల్చిన నప్పిన్న నీళ ఉత్తుంగ స్తనగిరులపైన

తలలోన తురిమిన అర్థవికసితపుష్పసుగంధములు చెలగ

ఒదిగిన మాధవయ్య ఒక మాటైన మా కొరకు పలకవయ్య

కంటికాటుకచీకటిని శ్యామసుందరు దాచుట నీ గుణము కాదు

నీళ నీ కౌగిలి బిగి సడలించి కృష్ణునొకింత మాకొదలవమ్ము

తనయులను కాపాడడానికి పోటీ పడే అమ్మానాన్నల ఆతురతను శృంగారపరంగా ప్రకటించే పాశురం ఇది

అర్థం: కుత్తువిళక్కెరియ= గుత్తుదీపాలు, ఎఱియ= వెలుగుతూ ఉండగా, కొట్టుక్కాల్= దంతంతో చేసిన కోళ్లుగలిగిన, కట్టిన్ మేల్=మంచముపైన, మెత్తెన్ఱ= మెత్తనైన, పఞ్చశయనత్తిన్ మేల్= ఐదుగుణములు గల పాన్పుపైన, ఏఱి= ఎక్కి, కొత్తు= గుత్తులుగా ఉన్న, అలర్ = వికసించిన, పూజ్ఞుక్కళల్ = పూలుముడిచిన కొప్పుగల, నప్పిన్నై= నీళాదేవి, కొజ్ఞైమేల్ =స్తనములపై, వైత్తుక్కడన్ద= శరీరమును ఆనించి పడుకున్న, మలర్= వికసించిన మార్ పా= వక్షస్థలము గలిగినవాడా, వాయ్ తిఱవాయ్= నోరు తెఱచి ఓ మాట చెప్పు, మై= కాటుక పెట్టుకుని, తడమ్= విశాలమైన, కణ్ణినాయ్= కన్నులు గలదానా, నీ= నీవు, ఉన్మణాళనై= నీ వల్లభుని, ఎత్తనైపోదుమ్= కొంతసేపడికైనా, తుయిలెళవొట్టాయ్ కాణ్= లేవనీయవా ఏమి, ఎత్తనైయేలుమ్= ఎంతమాత్రమైనా, పిరివు= తెఱపి ఎడబాటు, అత్తగిల్లాయ్=ఓర్వలేవా, ఆల్ = ఆశ్చర్యము, తత్తువమన్ఱు= నీ స్వరూపము కాదు కదా తకవన్ఱు= నీ స్వభావమూ కాదు కదా?

Next Story