హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ పోస్టర్ ఆవిష్కరణ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 5:41 AM GMT
హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ పోస్టర్ ఆవిష్కరణ

విజయ్ శంకర్, మౌర్యాని జంటగా శివత్రి ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ చిత్రం పోస్టర్ ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ... మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమాకు అపజయమంటూ ఉండదు. ఈ సినిమా టైటిల్ కూడా చాలా బాగుంది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నూటికినూరు శాతం సినిమా విజయవంతమవుతుందని ఆశిస్తున్నాను. అందరూ యంగ్ స్టర్స్‌తో సినిమా రూపొందించడం విశేషమన్నారు.

Srikanth2

నిర్మాత పడ్డాన మన్మథరావు మాట్లాడుతూ... సినిమా తాము అనుకున్నదానికన్నా బాగా వచ్చిందని చెప్పారు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించామన్నారు. హీరో శ్రీకాంత్ గారు మంచి మనసుతో తమను ఆశీర్వదించారని, ఆయన పేరులోనే సక్సెస్ ఉందని, ఆయన చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించడం తమ విజయానికి మొదటి మెట్టుగా భావిస్తున్నానని అన్నారు. దర్శకుడు వెంకటరమణ ఎస్ మాట్లాడుతూ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని చెప్పారు. కథను నమ్ముకునే తాము ఈ ప్రాజెక్టును చేపట్టామని, విజయం తమ సొంతమవుతుందని నమ్ముతున్నామన్నారు.

Srikanth3

హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ... తనకు ఇది మొదటి సినిమా అని చెప్పారు. హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరగడం తన అదృష్టమన్నారు. తన కెరీర్ లో ఇదే నిజమైన దీపావళి అన్నారు. సంగీత దర్శకుడు సదాచంద్ర మాట్లాడుతూ ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయని చెప్పారు. అన్ని పాటలు బాగా వచ్చాయని చెప్పారు. హీరో శ్రీకాంత్ స్వయంకృషితో పైకొచ్చిన హీరో అని, ఆయన ఆశీర్వచనాలు తమకు ఉంటాయని అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, నటుడు వెంకట గోవిందరావు మాట్లాడుతూ యువతరం నటులతో ఈ సినిమా తెరకెక్కిందని చెప్పారు. మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అవుతుందన్నారు.

Next Story
Share it