దేవెగౌడ మనవడు, స్టార్ హీరో నిఖిల్ కుమార్ పెళ్లి

By రాణి  Published on  28 Jan 2020 11:44 AM GMT
దేవెగౌడ మనవడు, స్టార్ హీరో నిఖిల్ కుమార్ పెళ్లి

ముఖ్యాంశాలు

  • పూర్వ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడి పెళ్లి
  • పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్న నిఖిల్
  • రాజకీయాల్లో, సినిమాల్లో రాణిస్తున్న నిఖిల్ కుమార్
  • కొత్త సంవత్సరంలో నిఖిల్ కి నాలుగు సినిమాలు
  • షూటింగ్ లతో బిజీగా ఉండబోతున్న నిఖిల్
  • కెరీర్ విషయంలో రాజీపడని తత్త్వం నిఖిల్ ది
  • రేవతి తండ్రి పెద్ద వ్యాపారస్తుడు
  • బెంగళూరులోనే చదువుకున్న రేవతి

కర్ణాటక రాజకీయ దిగ్గజం హెచ్.డి.దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ కి పెళ్లి కుదిరింది. సీనియర్ పొలిటీషియన్ ఎమ్. కిష్టప్ప మనవరాలు రేవతితో నిఖిల్ కుమార్ కి వివాహం నిశ్చయమయ్యింది. మొదట్నుంచీ తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే చేసుకుంటానని చెబుతున్న నిఖిల్ చెప్పిన మాటకు కట్టుబడి కుమారస్వామి, ఆయన భార్య అనిత చూసిన సంబంధాన్నే చేసుకుంటున్నాడు.

పెళ్లికూతురు రేవతి ఎమ్.కిష్టప్ప మేనకోడలి కూతురు. రెండు కుటుంబాలూ కర్ణాటక రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు కలిగినవే అయినా దేవెగౌడ కుటుంబానిదే ఈ విషయంలో పూర్తిగా పై చేయి అని చెప్పాలి. నిఖిల్ కుమార్ అటు సినిమాల్లో హీరోగా ఇటు రాజకీయాల్లో తనదైన ముద్రవేస్తున్న బలమైన నాయకుడిగా ఎదుగుతున్న తరుణమిది. పెళ్లిమాటలు పూర్తైనప్పటికీ ఎంగేజ్ మెంట్ కీ, పెళ్లికీ ఇంకా తేదీలను నిర్ణయించలేదని తెలుస్తోంది. నిఖిల్ కి ఈ కొత్త సంవత్సరంలో నాలుగు కొత్త సినిమాలున్నాయి. వాటి షూటింగ్ లతో ఊపిరిసలపనంత ఒత్తిడిలో ఉంటాడు. రేవతి తండ్రి పేరుమోసిన వ్యాపారస్తుడు. పెళ్లికూతురు బెంగళూరులోనే చదువుకున్నట్టుగా తెలుస్తోంది.

ఈ ఏడాది చివర్లో పెళ్లి పెట్టుకుంటే బాగుంటుందని రెండు కుటుంబాలూ అనుకుంటున్నట్టు సమాచారం. నిఖిల్ తన ప్రొఫెషనల్ కెరీర్ విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రశ్నేలేదని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగా కొత్త సినిమాల షూటింగ్ లకు అంతరాయం కలగని సమయాన్ని ఎంచుకుని ఆ సమయంలో పెళ్లి పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

Next Story