'ఇది నీ వల్ల కాదు' అని ఎవ‌రైనా అంటే.. దాని అంతు చూస్తా..

By Bala Maram Reddy  Published on  21 April 2020 6:32 PM IST
ఇది నీ వల్ల కాదు అని ఎవ‌రైనా అంటే.. దాని అంతు చూస్తా..

ఎల్.ఎఫ్.జె.సి(లిటిల్ ప్ల‌వ‌ర్ జూనియ‌ర్ కాలేజ్‌) గ్లోబల్ వెబ్ సిరీస్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ దివ్య రెడ్డి పలు విషయాలను వెల్లడించారు. తన కాలేజీ లైఫ్ లో చోటు చేసుకున్న అంశాలు, అక్కడ ఎటువంటి అంశాలను నేర్చుకున్నాము వంటివన్నీ చెప్పుకొచ్చారు.

కాలేజీ లైఫ్ :

దివ్య రెడ్డి మాట్లాడుతూ.. తన కాలేజీ లైఫ్ లో ఎన్నో అల్లరి పనులు చేసి చాలా పనిష్మెంట్లను అనుభవించామని.. అవన్నీ తలచుకుంటే నవ్వు వస్తోందని అన్నారు. ముఖ్యంగా ఏదైనా అల్లరి పని చేసి దొరికిపోయాక.. తల్లిదండ్రులను పిలుచుకుని రమ్మని చెప్పే వాళ్ళని.. అది విన్నాక ఎంతో టెన్షన్ పడే వాళ్లమని చెప్పింది. ఇక కెరీర్ పరంగా తాను ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్తానని అసలు అనుకోలేదని దివ్య రెడ్డి అన్నారు. అమెరికాకు వెళ్ళాక తాను ఫ్యాషన్ డిజైనింగ్ ను ఎంచుకున్నానని.. ఎవరైనా నువ్వు ఇది చేయలేవు అని అంటే అది తప్పకుండా చేసి తీరాలని అనుకుంటానని.. అదే తనకు మోటివేషన్ లాంటిదని దివ్య రెడ్డి అన్నారు. 'ఇది నీ వల్ల కాదు' అని ఎవరైనా అంటే మాత్రం.. ఎందుకు కాదు.. అదీ చూస్తా అని ఆ పనిని చేయడం మొదలుపెడతానని ఆమె చెప్పారు.

D3

కుటుంబం, కెరీర్‌ :

నేను సింగిల్ మదర్, నా ఆరేళ్ళ కొడుకుతో, నా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నానన్నారు. లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొనడానికి తన టీమ్ తో కలిసి చాలా కష్టపడ్డామని చెప్పారు. అలాగే పలు ఫ్యాషన్ ఈవెంట్స్ లో కూడా పాల్గొన్నామని మంచి పేరు సంపాదించుకున్నామని తెలిపారు. మొదట ఇద్దరు వ్యక్తులతో మొదలైన నా టీమ్.. ఇప్పుడు 170 మందికి చేరుకుందని గర్వంగా చెప్పారు దివ్య రెడ్డి. తన వర్క్ లో ప్లాన్ బి అన్నది ఉండదని.. ఏదైనా కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికే ప్రయత్నిస్తానని అన్నారు. తన ఆటిట్యూడ్ చూసిన వాళ్లంతా.. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎలా ఉండగలుగుతున్నావని అంటారని కానీ నా వర్క్ నేను చేసుకుంటూ వెళుతున్నానని తెలిపింది. ప్రతి ఒక్కరూ కెరీర్ లో ప్లాన్ A, ప్లాన్ B అని పెట్టుకుంటారని.. అలా పెట్టుకోవడం వలన ప్లాన్ Aలో మార్పులు జరిగి తమ లక్ష్యాలను మరచిపోతూ ఉంటారని.. అందుకే తానెప్పుడూ ప్లాన్ B ని పెట్టుకోవడం లేదని అన్నారు.

D4

ఎల్.ఎఫ్.జె.సి. కాలేజీలో తాము చేసిన సందడిని దివ్య రెడ్డి గుర్తు చేసుకున్నారు. తాము చేసిన అల్లర్లను, చేసిన పనులను తమ క్లాస్ మేట్స్ తో కలిసి పంచుకున్నారు. ఏదో ఒకరోజు అందరూ కలుద్దామని కూడా మాట్లాడుకున్నారు. దివ్య రెడ్డి పలువురు ప్రముఖులకు డ్రస్ లు డిజైన్ చేసింది.. హైదరాబాద్ లోని టాప్ ఫ్యాషన్ డిజైనర్లలో ఈమె కూడా ఒకరు. పలు సేవా కార్యక్రమాల్లో కూడా దివ్య రెడ్డి పాలు పంచుకుంటూ ఉన్నారు. చాలా మంది వయసు అయిపోయాక సేవ చేద్దామని అనుకుంటారని.. కానీ తాను మాత్రం అలాంటివేవీ పెట్టుకోలేదని.. సహాయం చేయాలి అనుకున్నప్పుడు వయసుతో అవసరం లేదని చెబుతున్నారు.

D1

ఎల్.ఎఫ్.జె.సి. గ్లోబల్ వారి సౌజన్యంతో బాల మారమ్ రెడ్డి తమ కాలేజీ పూర్వ విద్యార్థులతో ఇంటర్వ్యూలను నిర్వహిస్తూ వస్తున్నారు. కాలేజీలో వారికున్న మధురస్మృతులను గుర్తు చేయడమే కాకుండా.. ప్రస్తుతం వారి కెరీర్లు ఎలా ఉన్నాయి అన్న విషయాలపై కూడా ఆయన వారితో చర్చించారు. ఈ ఇంటర్వ్యూలను న్యూస్ మీటర్ తెలుగు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.

Next Story