డెహ్రాడూన్‌: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశమంతా’ డెంగ్యూ’ జనాలను వణికిస్తుంది. ఇక..ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌ను ‘డెంగ్యూ’ భయపెడుతోంది. వేల సంఖ్యలో రోగులు ఆస్పత్రుల దగ్గరకు క్యూకడుతున్నారు. ప్రస్తుతం లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్‌లో 4వేల 800 మందికి డెంగ్యూ సోకినట్లు తెలుస్తోంది. ఇక..రాజధాని డెహ్రూడూన్‌ పరిసరాల్లో డెంగ్యూ తీవ్రత అధికంగా ఉంది. ఇక్కడే 3వేల మంది వరకు డెంగ్యూతో బాధ పడుతున్నారు. ఇక..హల్డ్ వానిలో 11వందల కేసులు నమోదయ్యాయి.

Image result for uttarakhand dengue

డెంగ్యూ వణికిస్తుండటంతో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ స్పందించారు.డెంగ్యూ జ్వరం తగ్గకపోతే..500 ఎంజీకి బదులు..650 ఎంజీ పారాసిటమల్ టాబ్లెట్లు వేసుకోవాలన్నారు. టాబ్లెట్ వేసుకుని.. విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గుతుందన్నారు. డెంగ్యూతో 8 మంది చనిపోయారని వార్తలు వస్తుంటే..లేదు..లేదు నలుగురు మాత్రమే చనిపోయారని సీఎం రావత్ చెబుతున్నారు.

Image result for uttarakhand dengue

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.