దిల్లీలో దారుణం.. మహిళా ఎస్‌ఐ దారుణ హత్య

By Newsmeter.Network  Published on  8 Feb 2020 7:48 AM GMT
దిల్లీలో దారుణం.. మహిళా ఎస్‌ఐ దారుణ హత్య

తెల్లవారితే దిల్లీలో ఎన్నికల కోలాహాలం మొదలవుతుంది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. ఒక్కసారిగా కలకలం చెలరేగింది. విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్‌ఐ దారుణ హత్యకు గురయ్యారు.

దిల్లీలోని రోహిణి ప్రాంతంలో మహిళా ఎస్‌ఐ ప్రీతి అహ్లావత్ ను ఓ యువకుడు కాల్చి చంపాడు. ప్రీతి ఢిల్లీలోని పట్‌పడ్‌ గంజ్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఇంటికి నడిచి వెళ్తుండగా.. ఓ యువకుడు ఆమె వెనుక వచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో కిందపడిన ప్రీతి అక్కడిక్కడే మరణించింది. ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని.. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story
Share it