హైదరాబాద్ కు ఢిల్లీ పొగమంచు ముప్పు? తగ్గిన వాయు నాణ్యత సూచీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Nov 2019 7:41 AM GMTవాయుకాలుష్యం దేశాన్ని వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టిన పొగమంచు దుష్ఫలితాలు నిపుణులు సూచించిన విధంగానే ఇప్పుడు హైదరాబాద్ కు చేరాయి. హిమవారి ఉపగ్రహం అందించిన చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మధ్యభారతంలో పంటపొలాల్లో చెత్తను తగలబెట్టడంవల్ల విడుదలైన పొగ వాతావరణంలో పెద్ద ఎత్తున చేరి కాలుష్యాన్ని మరింతగా పెంచింది. దీనివల్ల ఢిల్లీలో పేరుకుపోయిన పొగమంచు మెల్లగా కదిలి ఉత్తరభారతంనుంచి దక్షిణ తీరానికి తరలివచ్చింది. హైదరాబాద్ కు పశ్చిమాన ఉన్న నల్లగండ్ల గ్రామాన్ని చుట్టేసిన దట్టమైన పొగమంచు చిత్రాలను ఉపగ్రహం స్పష్టంగా చిత్రీకరించింది.
�
చిత్రం 2 : భారత దేశంలో దేశవ్యాప్తంగా పొలాల్లో పంట వ్యర్థాలు తగలబడుతున్న దృశ్యాలు
�
�
చిత్రం 3 : దేశవ్యాప్తంగా పంట పొలాల్లో వ్యర్థాలను తగలబెడుతున్న దృశ్యాలు
�
చిత్రం 4 : మధ్యభారతంలో పంట పొలాల్లో వ్యర్థాలను తగలబెట్టడంవల్ల పెరిగిన పొగ మంచుతోకూడి ఏర్పడిన పొగమంచు, హైదరాబాద్ లోనూ కాలుష్యం
�
సనత్ నగర్ లోని వాతావరణ కేంద్రం అందిస్తున్న సమాచారం ప్రకారం గాలిలో ధూళిశాతం పి.ఎం 2.5 ఆఫ్ 230 గా నమోదయ్యింది. ఉత్తరాదినుంచి దక్షిణాదికి పాకుతున్న కాలుష్యపూరితమైన పొగమంచు కారణంగా దక్షిణాదిలోని హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో వాయుకాలుష్యం శాతం చాలా ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్ లోని యూఎస్ కాన్సొలేట్ ప్రాంతంలో వాయు నాణ్యత సూచీ 194 గా నమోదయ్యింది. ఐడిఎ పాశ మైలారం, బొల్లారం పారిశ్రామిక ప్రాంతాల్లో ఇది 163 దరి దాపుల్లో ఉంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రాంతంలో నమోదైన సూచీ 161. ఢిల్లీలో అత్యధిక శాతం కాలుష్యం గాలిలోనిండి ఉంది. ధూళి, కర్బన సాంద్రత చాలా ఎక్కువగా ఉన్నాయి. ధూళిశాతం 2.5 గా నమోదయ్యింది.
�
దేశ వ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు వాతావరణ పరిస్థితిని తెలిపే యానిమేషన్ చిత్రం
�
Also read:
దక్షిణ భారతానికి విస్తరిస్తున్న వాయు కాలుష్యం, తమిళనాడులో గాలిలో ధూళి, కర్బన సాంద్రత పెరుగుదల, సూచీ 200 - 300 వరకూ భారీగా పెరిగే సూచనలు
�
�