ముసుగులు ధరించి.. క్యాంపస్‌లోకి ప్రవేశించి..
By న్యూస్‌మీటర్ తెలుగు
ఢిల్లీలోని జేఎన్‌యూలో ఆదివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్‌లు ధరించి క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్ధులు, ప్రొఫెసర్లను చితకబాదడంతో పాటు వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ దాడిలో విద్యార్థి సంఘం నాయకుడితో పాటు పలువురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి.
క్యాంపస్‌లో దుండగులు భయోత్పాతం సృష్టించినా పోలీసులు, సెక్యూరిటీ గార్డులు పట్టించుకోలేదని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సాకేత్ మూన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఏబీవీపీ సంబంధించిన వారే తమపై దాడికి పాల్పడ్డారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తుండగా.. వామపక్ష విద్యార్థి సంఘాల వారే తమ సభ్యులపై దాడికి పాల్పడ్డారని ఏబీవీపీ నేతలు ఆరోపించారు.
ఇక ప్రత్యక్ష సాక్షులు మాత్రం.. ముసుగు ధరించిన 50 మంది దుండగులు క్యాంపస్‌లోకి ప్రవేశించి హాస్టల్ రూమ్‌ల్లోకి చొరబడి విద్యార్ధులు, ప్రొఫెసర్లను చితకబాదారని తెలుపుతున్నారు.