ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఘటన స్థలానికి 45 ఫైరింజన్లు

By సుభాష్  Published on  22 May 2020 4:46 AM GMT
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఘటన స్థలానికి 45 ఫైరింజన్లు

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి సమయంలో ఢిల్లీలోని చునా భట్టి మురికివాడలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన 45 అగ్నిమాపక శకటాలతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

కాగా, ఈ ప్రమాదంపై ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ చీఫ్‌ అధికారి రాజేశ్‌ పన్వార్‌ మాట్లాడుతూ... గురువారం అర్థరాత్రి సమయంలో చౌనా బస్తీలో అగ్నిప్రమాదం జగినట్లు తమకు సమాచారం అందిందని, దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి 45 ఫైరింజన్లతో మంటలను అతికష్టం మీద మంటలను అదుపు చేశామన్నారు.ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు కానీ కాలేదన్నారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉందన్నారు. ప్రమాదం కారణంగా మురికి వాడలో చాలా ఇళ్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు.

కాగా, గురువారం పశ్చిమ ఢిల్లీలోని ఓ ఫర్నిచర్‌ మార్కెట్ ఏరియాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఫర్నిచర్‌ షాపులో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో భారీగా ఫర్నిచర్‌ కాలిబూడిదైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆదుపులోకి తీసుకువచ్చి నలుగురికి ప్రమాదం నుంచి కాపాడారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరగడంతో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారిందని, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారని ఫైర్‌ సిబ్బంది తెలిపారు.



Next Story