దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అనాజ్‌ మండీలోని ఓ పెద్ద భవనంలోని ప్లాస్టిక్‌ బ్యాగుల తయారీ రూమ్‌లో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు భారీగా వ్యాపించడంతో 32 మంది ఆగ్ని ఆహుతి అయ్యారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే లోక్‌నాయక్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అన్నారు. మృతుల్లో చాలా మంది ఊపిరాడక చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 50 మంది సురక్షితంగా బయటపడ్డారని సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాని అగ్ని మాపక సిబ్బంది చేరుకున్నారు. దాదాపు 30 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.