చెత్త రికార్డు మూటగ‌ట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Oct 2020 4:45 PM IST
చెత్త రికార్డు మూటగ‌ట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్-2020లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓడిపోయింది. దీంతో ఐపీఎల్‌లో 100 మ్యాచులు ఓడిన రెండో జట్టుగా ఢిల్లీ ఓ చెత్త‌ రికార్డును నెలకొల్పింది. ఈ జాబితాలో మొదట కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్టు ఉంది. అత్యధిక ఓటములు నమోదు చేసిన జట్లలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (95), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (88), ముంబయి ఇండియన్స్‌ (80), రాజస్థాన్‌ రాయల్స్‌ (74) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మొదట బ్యాటింగ్‌ చేసి 162 పరుగులు చేసింది. ధావన్‌ (69) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో ముంబయి బ్యాట్స్‌మెన్స్‌ క్వింటన్‌ డికాక్‌ (53), సూర్యకుమార్‌ యాదవ్‌ (53) ఆఫ్‌ సెంచరీలు చేయడంతో మ్యాచ్‌ను సులువుగా ముగించేశారు. ఈ విజయంతో పాయింట్ల పట్టిలో ముంబయి జట్టు మొదటి స్థానానికి చేరుకుంది. ఇక ఈ రోజు స‌న్‌రైజ‌ర్స్ హైద్రాబాద్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి.

Next Story