ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించింది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేయిస్తున్నారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ అన్నారు. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోందన్నారు. ఢిల్లీలో ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడకుండా ఆమ్‌ ఆద్మీ పార్టీ గత రెండేళ్లుగా ఆలస్యం చేసిందని ఆరోపించారు.

నిర్భయ తల్లికి ఓ సీనియర్‌ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్‌ కీలక సలహా ఇచ్చారు. ఉరిశిక్ష పడే నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించకుండా తల్లిగా క్షమించాలని నిర్భయ తల్లిని కోరారు. నిర్భయ అత్యాచారం తర్వాత ఓ తల్లి పడే బాధ ఎలాంటిదో నాకు తెలుసన్నారు. ఈ విషయంపై మనోజ్‌ తీవారీ స్పందించారు. ఆమె అలా కోరడాన్ని అక్కడి బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీ తీవ్రంగా తప్పుబట్టారు. ఆమె కూడా ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందని వ్యక్తేనన్నారు. తీహార్‌ జైలు ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోకే వస్తుందని ఆయన తెలిపారు.

నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురిని తీహార్‌ జైలులోని ఉరివేసే 3వ నెంబర్‌ జైలుకు తరలించారు. నలుగురు దోషులైన అక్షయ్‌ కుమార్‌, పవన్‌ గుప్త, ముఖేష్‌సింగ్‌, వినయ్‌ లను మొదటిసారిగా ఉరిశిక్ష జరిగే జైలు నంబర్‌ 3కు తరలించారు. వీరికి 22న ఉరిశిక్ష వేయాల్సిఉండగా, దోషి ముఖేష్‌ సింగ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ కారణంగా అది వాయిదా పడింది. దీంతో రాష్ట్రపతి ఆ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు నలుగురికి ఉరిశిక్ష వేయాలని తాజాగా కోర్టు వెల్లడించింది. ఈ నలుగురిని కూడా వేర్వేను సెల్స్‌ లో ఉంచి సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆసియాలోనే అతి పెద్ద జైలు అయిన తీహార్‌ జైలులో ఈ నలుగురిని ఉరి వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.