ఆన్‌లైన్ డిగ్రీ అడ్మిషన్ల తేదీ పొడిగింపు
By సుభాష్ Published on 8 Sep 2020 1:50 AM GMTతెలంగాణ ఆన్‌లైన్ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి 'దోస్త్' ఫేజ్ తెలంగాణలో ఆన్‌లైన్ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ‘దోస్త్’ ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ తేదీని పొడిగించినట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఆచార్య కన్వీనర్ లింబాద్రి ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం ఏర్పాటు చేసిన దోస్త్ ఫేస్-1 ప్రక్రియను ఒక రోజు పొడిగిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ రిజిస్ట్రేషన్ 7వ తేదీతో ముగిసింది. దీంతో విద్యార్థుల అభ్యర్థన మేరకు 8వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోనివారు ఉంటే ఈ రోజు చేసుకోవాలని కోరారు. తక్కువ మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వటంతో ఈ గడువుతేదీని పొడించారు.
వీరు అర్హత పొందవచ్చు:
ఇంటర్మీడియేట్ లేదా సమాన అర్హత ఉన్నవారు ఈ దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ పొందవచ్చు. ఆగస్టు 24 నుంచి మొదలైన ఈ అడ్మిషన్లు మూడు ఫేజ్‌లలో అక్టోబర్ 12 నాటికి పూర్తి కానుంది. ఇక ఆ తర్వాత విద్యార్థులకు డిజిటల్ లేదా ఫిజికల్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.
అయితే మొదటి ఫేజ్ అడ్మిషన్లు ఆగస్టు 24న ప్రారంభం కాగా, సెప్టెంబర్ 8తో ముగియనుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు https://dost.cgg.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు పేర్కొన్నారు.