వైరల్ అవుతున్న దీపికా పదుకొనే జిమ్ వర్కౌట్స్ వీడియో..!
By రాణి Published on 19 Feb 2020 11:41 AM IST
యూనివర్సల్ హీరోయిన్ దీపికా పదుకొనే జిమ్ వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, సినీ పరిశ్రమ అన్నాక ప్రతీ ఒక్కరూ బాడీ ఫిట్‌నెస్‌ను మెయింటెన్ చేస్తారన్న విషయం తెలిసిందే. ఇక అందులోను దీపికా పదుకొనే అయితే మరీనూ. ఈ పొడుగు కాళ్ల సుందరిని చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది జిమ్‌లో ఎన్ని గంటలు గడుపుతుందన్న విషయం. దీపికా జిమ్ వర్కౌట్స్ వీడియోను బాలీవుడ్‌కు చెందిన ఫిట్‌నెట్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీపికా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమె నిరంతరాయంగా జిమ్‌లో వర్కౌట్స్ చేయబట్టే బయటి ప్రపంచానికి మత్స్య కన్యలా, హంసలా కనపడుతుందని, మీరు కూడా సోమరి తనాన్ని వదిలి ఆరోగ్యంగా ఉండేందుకు జిమ్ వర్కౌట్స్ చేయండి అంటూ వీడియో కింద టెక్ట్స్ మెజేస్ పెట్టాడు యాస్మిన్ కరాచీవాలా. ఏదేమైనా మా గురించి మంచి చెప్పడం మాట అటుంచితే సోమరి పోతులని వ్యాఖ్యానించడం బాగాలేదంటూ కరాచీ వాలాపై మండిపడుతున్నారు కొందరు నెటిజన్లు.