ఓ త్లలీకూతుళ్ల హత్య కేసులో నెల్లూరు హరనాథపురం 8వ అదనపు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు ఇంతియాజ్‌కు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. 2013 ఫిబ్రవరి 12న మెడికో భార్గవి, తల్లి శకుంతల హత్య జరిగింది. ఈ కేసులో ముగ్గురు నిందితులపై కేసు నమోదైంది. కేసు విచారణ జరిపిన కోర్టు ఈ రోజు నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

భార్గవి, తల్లి శకుంతల హత్య, తండ్రి దినకర్ రెడ్డి హత్యాయత్నంలో ముగ్గురు నిందితులపై కేసు నమోదు కాగా, ఇప్పటికే ఇద్దరు మైనర్లు జువైనల్‌ కోర్టులో శిక్ష అనుభవిస్తున్నారు. నగరంలోని వాగ్దేవి డి ఫార్మసీ కాలేజీ కరస్పాండెంట్‌ దినకర్‌ రెడ్డి స్థానిక హరనాథపురంలో భార్య, కుమార్తెతో కలిసి జీవిస్తున్నారు. కుమార్తె భార్గవి నెల్లూరు నారాయణ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. హరనాథపురంలో నిర్మిస్తున్నకొత్త ఇంటికి ఎలివేషన్‌ ప్లాన్‌ తయారు చేసుకునేందుకు దినకర్‌ ఒకరిని కలిశారు. దీంతో ఇద్దరు బాబాలతో ప్లానింగ్‌ డిజైనర్‌ దినకర్‌ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో కత్తులు, రాళ్లతో బెదిరించి బంగారు నగలను దోచుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అడ్డుకున్న తల్లీకూతుళ్లపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక తుది తీర్పులో నిందితుల్లో ఒకడైన ఇంతియాజ్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.