నిర్భయ దోషులను ఇలా ఉరి తీయనున్నారట..!

By సుభాష్  Published on  14 Dec 2019 6:46 PM IST
నిర్భయ దోషులను ఇలా ఉరి తీయనున్నారట..!

ముఖ్యాంశాలు

  • ఒకేసారి నలుగురిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు

  • నలుగురిని మోయగల ఉరి స్తంభం ఏర్పాటు

ఢిల్లీలో నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలన రేపిన విషయం తెలిసిందే. 2012, డిసెంబర్‌ 16న జరిగిన ఈ ఘటనపై ఆరుగురు నిందితులు అరెస్టు కాగా, ఒకరు జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడిని మైనర్‌ గా భావించి మూడు సంవత్సరాల పాటుజైలు శిక్ష విధించారు. అత్యంత అమానమీయమైన రీతిలో హత్య చేసిన ఉదతంలో నలుగురు నిందితులకు ఉరిశిక్షను వేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

ఆ నలుగురు నిందితులను ఈనెల 16న ఉరి శిక్ష వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, నలుగురు దోషులను ఒకే సమయంలో ఉరి తీసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ట్రయల్స్ కూడా ఇప్పటికే చేసినట్లుగా సమాచారం. ఒకేసారి నలుగురి బరువు మోయగలిగే సామర్థ్యం ఉరికంబానికి ఉందా? అన్న విషయాన్ని టెస్టు చేయటం కోసం కొత్త టెక్నిక్ ను జైలు అధికారులు అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్భయ నలుగురు దోషుల్ని ఒకేసారి ఉరి తీయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

నలుగురి బరువును మూడు గంటల పాటు ఉరి కంబాలు మోయగలవా? లేవా? అన్ని నిర్దారించటం కోసం తీహార్ జైలు అధికారులు రెండు సార్లు ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. మెడకు ఉరితాళ్లు గట్టిగా బిగుసుకుపోకుండా ఉండేలా.. దానికి వెన్న రాయనున్నారు. దీంతో.. తక్కువ నొప్పితో దోషులు మరణించే అవకాశం ఉంటుందని జైలు అధికారులు చెబుతున్నారు.

తీహార్‌ జైల్లో 1950లో ఉరి ప్రాంగణం :

ప్రస్తుతం నలుగురు దోషులు తీహార్‌ జైల్లో ఉన్నారు. ఈ జైల్లో ఉరి తీసే ప్రాంగణాన్ని1950లో నిర్మించారు. రెండు స్తంభాలను కలుపుతూ మెటల్ బార్ ను ఏర్పాటు చేశారు. దీనికి ఉరితాడును కట్టనున్నారు. ఆ తాళ్ల వల్ల మెడ కోసుకుపోకుండా.. గాయాలు కాకుండా చూడాల్సి ఉంటుందని జైలు అధికారులు చెబుతున్న మాట. దోషులను ఉరి తీసే సమయం దగ్గర పడుతుండటంతో ఉరికి సంబంధించిన ఏర్పాట్లలో జైలు అధికారులు బిజీ బిజీగా ఉన్నారు

ఉరితాళ్లను తయారు చేస్తున్న బక్సర్‌ జైలు ఖైదీలు :

సుప్రీం కోర్టు ఆదేశంతో 10 ఉరి తాళ్లు సిద్ధమవుతున్నాయి. బీహార్‌లోని బక్సర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్ ఖైదీలో ఈ ఉరితాళ్లను తయారు చేస్తున్నట్లు ఆ జైలు అధికారులు ఇటీవల వెల్లడించారు. అప్జల్‌ గురు ఉరి తీసిన తాడును కూడా ఈ జైలు ఖైదీలో తయారు చేశారు. ఉరి తాళ్లను తయారు చేసే వాటిలో ఈ బక్సర్‌ జైలు ప్రసిద్ధి. ఈ ఉరితాళ్లను తయారు చేసేందుకు ప్రత్యేక తాళ్లను వాడుతుంటారు. ఈనెల 14వ తేదీలోగా పది ఉరి తాళ్లు తయారు కావాలని ఇప్పటికే కోర్టు ఆదేశించింది.

Next Story