ముంబై: మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరాఠీ ప్లేబ్యాక్ సింగర్ గీతా మాలీ మృతి చెందారు. ముంబై-ఆగ్రా హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవలే యూఎస్ నుంచి వచ్చిన ఆమె తన స్వస్థలమైన నాసిక్‌కు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

అయితే గురువారం తెల్లవారుజామున 3గంటలకు ఆమె ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు పక్కన నిలిపివుంచిన ఓ కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గీతతో పాటు ఆమె భర్తకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గీత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అయితే కొన్ని గంటల వ్యవధిలోనే గీత మృతి చెందటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే గీత పలు మరాఠీ సినిమాలలో పాటల పాడారు. ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.