ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Nov 2019 9:42 AM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

బికనేర్‌: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బికనేర్‌ నేషనల్‌ హైవేపై వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో బైక్‌పై వస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని పాల్‌గౌతమ్‌ జిల్లా కలెక్టర్‌ చెప్పారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it