ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2019 6:01 AM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కృష్ణా: జగ్గయ్యపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న కారు.. రోడ్డు అవతల వైపు నుంచి వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద స్థలంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక కారులోని ప్రయాణికులు మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story
Share it