ఘోర ప్రమాదం.. 8 మంది మృతి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2019 7:18 AM GMT
ఘోర ప్రమాదం.. 8 మంది మృతి..!

తుముకూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుముకూరు సమీపంలోని కొరటగెరెలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరి కొంత మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే గాయపడిన మిగతా ప్రయాణికులను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

అయితే ప్రమాదం జరిగిన బస్సులో ఎక్కువగా విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఒక రోజులో 10కి పైగా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో..అధికారులు చర్యలు తీసుకున్నారు. అయినప్పటికి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగినట్లు బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు ఆరోపించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతి చెందిన వారిలో నలుగురు కాలేజీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులని సమాచారం. అయితే ఈ ప్రమాదం జరిగిన బస్సులో తుముకూరు నుంచి మంగళూరు వెళ్తున్న ప్రయాణికులు ఉన్నారు. హైవే రోడ్డుపై ప్రైవేట్‌ బస్సులు అతివేగంతో వెళ్లకుండా.. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story
Share it