కరోనాకు మరో వ్యాక్సిన్‌.. అనుమతి ఇచ్చిన డీసీజీఐ

By సుభాష్  Published on  11 July 2020 8:08 AM GMT
కరోనాకు మరో వ్యాక్సిన్‌.. అనుమతి ఇచ్చిన డీసీజీఐ

దేశంలో కరోనా రాకాసి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనాకు వ్యాక్సిన్‌ లోని కారణంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో వినియోగించే మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆప్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. సోరియాసిస్ ను నయం చేసేందుకు ఉపయోగించే 'ఇటోలీజుమ్యాజ్‌' ఇంజెక్షన్‌ను అత్యవసర వినియోగం కింద వాడేందుకు అంగీకరిస్తూ అనుమతి ఇచ్చింది. అలాగే మోతాదు నుంచి తీవ్ర స్థాయిలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగులకు ఈ ఇంజెక్షన్‌ ఇవ్వవచ్చని తెలిపింది.

కరోనా చికిత్సలో ఉన్న పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఇంజెక్షన్‌ను వాడవచ్చని అనుమతిచ్చినట్లు అధికారులు తెలిపారు. భారత్‌కు చెందిన బయోకాన్‌ సంస్థ దీనిని తయారు చేస్తోంది. కొవిడ్‌పై పోరాడే యాంటీబాడీల ఉత్పత్తిలో కీలకంగా పని చేసే సైటోకిన్ల విడుదలలో ఇది సమర్థంగా పని చేస్తున్నట్లు గుర్తించారు.

రోగులపై ప్రయోగం చేశాకే అనుమతులు..

కాగా, ఈ ఇంజెక్షన్‌ను రోగులపై ప్రయోగం చేసిన తర్వాత మంచి ఫలితాలు రావడంతోనే దీనికి అనుమతి ఇచ్చినట్లు డీసీజీఐ తెలిపింది. ఎయిమ్స్‌ కు చెందిన పలువురు వైద్య నిపుణులు ఈ ప్రయోగాలను పర్యవేక్షించినట్లు వెల్లడించారు. అయితే అనేక సంవత్సరాలుగా సోరియాసిస్‌ చికిత్సలో వినియోగిస్తున్నట్లు డీసీజీఐ అధికారులు తెలిపారు. కాగా, దీనిని తీసుకోవాడనికి ముందు బాధితులు రాత పూర్వకంగా అంగీకారం తెలుపాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు.

కాలేయం, కిడ్నీల పనితీరు పరీక్షించాకే మందు..

అయితే కరోనా సోకిన వారిలో 'ఇటోలీజుమ్యాజ్‌' బాగా పని చేస్తోందని ముంబాయిలోని నాయిర్‌ ఆస్పత్రి మే నెలలోనే ప్రకటించింది. ముందు రోగుల కాలేయం, కిడ్నీల పనితీరును పరీక్షించిన తర్వాతే ఈ మందును ఇస్తారు. కొందరి రోగులకు ఒక డోసు సరిపోదు.. మరి కొందరికి మూడు డోసుల వరకు ఇవ్వాల్సి ఉంటుందని అప్పట్లో నాయిర్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Next Story