అండర్‌ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్ర‌హీంకు క‌రోనా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Jun 2020 1:39 PM GMT
అండర్‌ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్ర‌హీంకు క‌రోనా..!

ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా తాజాగా అండర్‌ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం ఇంటిని తాకింది. దావుద్‌తో పాటు ఆయన భార్య‌ కూడా కరోనా బారినపడ్డట్లు తెలుస్తుంది. ఈ మేర‌కు పాకిస్తాన్‌లోని కరాచీ సమీపంలో గల మిలటరీ ఆస్పత్రిలో దావూద్‌కు వైద్యం అందిస్తున్నారని సమాచారం.

మొద‌ట‌గా దావుద్ భార్య మెహజీబేన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలడంతో దావూద్‌కు నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. దావూద్‌తో పాటు ఆయన వ్యక్తి సిబ్బందిని కూడా క్వారెంటైన్‌కు తరలించినట్లు ప‌లు వార్తా సంస్థ‌లు ప్ర‌చురించాయి.

అయితే.. ఈ వార్తలను మాత్రం పాకిస్తాన్‌‌ మీడియా తీవ్రంగా ఖండిస్తోం‍ది. ఇదిలావుంటే.. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్‌ ఇబ్రహీం ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దాదాపు 25 ఏళ్లుగా దావుద్ బయటి ప్రపంచానికి కనిపించకుండానే ర‌హ‌స్యంగా త‌ల‌దాచుకుంటున్నాడు.

Next Story