Fact Check : దావూద్ ఇబ్రహీం కరోనాతో చనిపోయాడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Jun 2020 8:19 AM GMT
Fact Check : దావూద్ ఇబ్రహీం కరోనాతో చనిపోయాడా..?

దావూద్ ఇబ్రహీం.. ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్.. భారత్ కు మోస్ట్ వాంటెడ్ అతను..! ప్రస్తుతం కరాచీలో దావూద్ దాగి ఉన్నాడని అంటున్నారు. 1993 ముంబై సీరియల్ బ్లాస్ట్స్ తర్వాత దావూద్ పలు ప్రాంతాల్లో తలదాచుకుంటూ ఉన్నాడు. తాజాగా కరోనా కారణంగా కరాచీలో దావూద్ ఇబ్రహీం చనిపోయాడంటూ వార్తలు వస్తున్నాయి. భారత్ కు చెందిన ప్రముఖ మీడియా ఛానల్ ఈ వార్తను పోస్టు చేయడంతో నిజంగానే దావూద్ ఇబ్రహీం చనిపోయాడని భావిస్తూ ఉన్నారు. ఈ వార్తను పలువురు షేర్ చేస్తూ ఉన్నారు.



పలు రిపోర్టులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదిక ప్రకారం దావూద్ ఇబ్రహీంకు, అతడి భార్యకు కోవిద్-19 సోకింది. వాళ్ళను కరాచీ లోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించారు.

నిజమెంత:

దావూద్ ఇబ్రహీం కోవిద్-19 కారణంగా చనిపోయాడన్నది పచ్చి అబద్ధం.

పలు మీడియా సంస్థల కథనాల ప్రకారం.. దావూద్ ఇబ్రహీం తమ్ముడు, డి-కంపెనీ అండర్ వరల్డ్ ఆపరేషన్స్ ను చూసుకుంటున్న అనీస్ ఇబ్రహీం ఈ వార్తలపై స్పందించాడు. కోవిద్-19 కారణంగా దావూద్ చనిపోలేదని అనీస్ స్పష్టం చేశాడు.

IANS వార్తా సంస్థతో మాట్లాడిన అనీస్.. దావూద్ ఇబ్రహీం కుటుంబానికి కరోనా వైరస్ సోకిందని వచ్చిన వార్త అబద్ధమని.. దావూద్ ఇబ్రహీం కుటుంబం ఇంటి నుండి బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారని అన్నారు.

పలు ప్రముఖ న్యూస్ వెబ్ సైట్స్ అనీస్ మీడియాతో మాట్లాడిన మాటలపై కథనాలను రాశాయి.

https://www.hindustantimes.com/india-news/dawood-ibrahim-s-brother-rubbishes-covid-19-rumours/story-KCsFR4GUKm1S7EFenuv1sM.html

IANS కూడా అనీస్ తో మాట్లాడిన విషయాలను ట్విట్టర్ లో పోస్టు చేసింది.



"Bhai (#Dawood) is fine & Shakeel is also fine. No one has tested positive for #coronavirus. No one from our family is admitted in hospital," said Anees.

ఆడియో:

"భాయ్(దావూద్) బాగున్నాడు, షకీల్ కూడా బాగున్నాడు. ఎవరికీ కరోనా వైరస్ సోకలేదు. మా కుటుంబం నుండి ఎవరూ ఆసుపత్రిలో చేయలేదు.. అంతా ఫస్ట్ క్లాస్ గా ఉన్నారు" అని అనీస్ మాట్లాడాడు.

పలు మీడియా సంస్థలు అనీస్ వ్యాఖ్యలపై కథనాలను ప్రచురించాయి:

https://www.outlookindia.com/newsscroll/dcompany-admits-business-in-pakistan-but-denies-dawoods-admission-in-karachi-hospital/1857062

https://www.ibtimes.co.in/d-company-admits-business-pakistan-denies-dawoods-admission-karachi-hospital-821697

ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దావూద్ కూ, అతడి భార్యకు కరోనా సోకిందంటూ రిపోర్టులు అందించాయి.. కానీ దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం ఈ వార్తలను ఖండించారు.. అని IANS మరో ట్వీట్ చేసింది.



IANS సంస్థ అనీస్ ఇబ్రహీంతో మాట్లాడి దావూద్ కు ఏమీ కాలేదన్న విషయం తెలుసుకున్నారు. ఇక కరాచీ, పాకిస్థాన్ కు చెందిన ఏ వార్తా సంస్థ కూడా దావూద్ ఇబ్రహీం కరోనాతో పాకిస్థాన్ ఆర్మీ ఆసుపత్రిలో చేరాడన్న వార్తను ప్రచురించలేదు.దావూద్ ఇబ్రహీం కరోనా వైరస్ తో చనిపోయాడన్న వార్త పచ్చి అబద్ధం.. ఆయన భార్యకు కరోనా వైరస్ సోకింది అన్న వార్తకు ఎటువంటి ఆధారాలు లేవు.

Claim Review:Fact Check : దావూద్ ఇబ్రహీం కరోనాతో చనిపోయాడా..?
Claim Fact Check:false
Next Story