కరోనా సమయంలో వినోదాన్ని పంచుతున్న క్రికెటర్
By తోట వంశీ కుమార్ Published on 9 May 2020 1:24 PM GMTకరోనా సెలవుల్ని విధ్యంసక వీరుడు డేవిడ్ వార్నర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అనుకోకుండా దొరికిన ఈ విరామాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. కూతురు కోరిక మేరకు ఇటీవలే టిక్‌టాక్‌లో అడుగు పెట్టిన ఈ సన్‌రైజర్స్ కెప్టెన్.. వరుస వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తన భార్య క్యాండీస్‌తో కలిసి మొన్న తెలుగు సినిమా అలవైకుంఠపురంలోని బుట్టబొమ్మకు పాటకు డ్యాన్స్ చేసిన వార్నర్ ..తాజాగా తమిళ సినిమాలోని సన్నజాజి పాటకి చిందులేశాడు. ముందు వరసలో కూతురు ఉండగా.. వెనకాల వార్నర్-కాండీస్ లు పాటకు అనుగుణంగా సెప్టులు వేశారు.
తమిళ్ స్టైల్‌లోనే 33 ఏళ్ల వార్నర్ వార్నర్ ప్యాంట్‌పై నుంచి లుంగీ కట్టి సెప్టులేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీంతో అభిమానులు మరిన్ని పాటలను వార్నర్‌కు సూచిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ వార్నర్, సూపర్ వీడియో బ్రో, సూపర్ కూల్ డ్యాన్స్ అభిమానులు కామెంట్లు చేయగా.. కరోనా సమయంలో వినోదాన్ని పంచుతున్న ఒకే ఒక్క క్రికెటర్ వార్నర్ అంటూ తెగ కొనియాడుతున్నారు.
ఇక కరోనా మహమ్మారి కారణంగా క్రీడారంగం కుదేలైంది. ఇప్పటికే పలు టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని టోర్నీలు రద్దు అయ్యాయి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక అభిమానుల దృష్టి అంతా అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ పై పడగా.. ఇప్పుడు ఈ టోర్నీపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.