అదిరిందయ్యా మార్క్.. నీ డేటింగ్ ఐడియా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Feb 2020 3:09 PM GMT
మరికొద్ది రోజుల్లో ప్రేమికులరోజు రానుండటంతో సింగిల్‌గా ఉన్న మగాళ్లు జోడీ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. తమ మనసు కోరుకునే మగువ కోసం కొత్తకొత్త పద్ధతులలో ఈ వెతుకులాట సాగిస్తున్నారు. డేటింగ్, చాటింగ్ యాప్స్‌తో పని కాలేదో.. ఏమో ఓ యువకుడు ఏకంగా తనతో డేటింగ్‌కు సింగిల్స్ కావాలని హోర్డింగ్ మీద ప్రకటన ఇచ్చేశాడు.
యాడ్ నిమిత్తం రూ. 40 వేలు ఖర్చు చేసిన మార్క్ అనే యువకుడు.. దానిని ఓ బిజీ రోడ్డులో దర్శనమిచ్చేలా ఏర్పాటుచేశాడు. తాను మోస్ట్ ఎలిజిబుల్ సింగిల్‌ను అంటూ మార్క్.. మాంచెస్టర్ సెంటర్‌లో ఈ ప్రకటనను ఉంచాడు.
డేటింగ్ యాప్స్‌లో సరిగా రెస్పాన్స్ లేకపోవడం వల్లనే.. ఓ బిల్‌బోర్డును కొనుగోలు చేసి ఇలా డేట్ కోసం పరితపిస్తున్నాననే ప్రకటన ఇచ్చానని.. మార్క్ తన ట్విటర్ ఖాతాలో చేసిన పోస్ట్‌కు ఓ రేంజ్‌లో స్పందన వస్తోంది. ఈ ప్రకటనతో ఇప్పుడు.. తనతో డేటింగ్ కోసం చాలా దరఖాస్తులు వస్తున్నాయని మార్క్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కొసమెరుపు ఏమిటంటే.. బిల్‌బోర్డే కాకుండా.. తన పేరిట ఓ డేటింగ్ సైట్.. డేటింగ్ మార్క్ క్రియేట్ చేశాడు ఈ ప్రబుద్దుడు.