కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. దసరా పండగ బోనస్‌ ప్రకటించిన సర్కార్‌

By సుభాష్  Published on  21 Oct 2020 1:50 PM GMT
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. దసరా పండగ బోనస్‌ ప్రకటించిన సర్కార్‌

కేంద్ర తమ ఉద్యోగులకు పండగ వేళ తీపి కబురు అందించింది. 2019-20 బోనస్‌ను ప్రకటించింది. ఈ ఏడాది బోనస్‌ వస్తుందో లేదోనన్న సందిగ్దంలో ఉన్న ఉద్యోగులకు బుధవారం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ నిర్ణయంతో 30.67 లక్షల మందికి లాభం చేకూరనుంది. ప్రస్తుతం ప్రకటించిన బోనస్‌ విలువ రూ.3.737 కోట్లు అని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ పేర్కొన్నారు. ఉత్పాదక, ఉత్పాదకేతర బోనస్‌ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

దసరా పండగకు ముందుగానే ప్రభుత్వం బోనస్‌ ప్రకటించింది. అయితే ఈ ఏడాది కరోనా ఉండటంతో బోనస్‌ ప్రకటిస్తుందో లేదోనన్న అనుమానం వ్యక్తం అయింది. అయితే ఈ ఏడాది పండగ దగ్గరపడుతున్నప్పటికీ బోనస్‌ ప్రకటించకపోవడంతో ఉద్యోగుల్లో కొంత నిరాశ వ్యక్తం అయింది. ఇక ఉద్యోగుల అనుమానాలను పటాపంచలు చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it