ఈ ఫొటోలో జింకకు పొంచివున్న ప్రమాదం ఏమిటో తెలుసా..?
By సుభాష్ Published on 29 May 2020 1:49 PM ISTసోషల్ మీడియాలో కొన్ని కొన్ని ఫోటోలు నెటిజన్లను తెగ అలరిస్తూ ఉంటాయి. మెదడుకు పని చెబుతూ ఉంటాయి. ఏదైనా పజిల్ ఇచ్చి వీటిలో ఉన్న వస్తువులు ఏమిటో కనుక్కోవాలంటూ ఛాలెంజ్ లను విసురుతూ ఉంటారు. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ రమేష్ బిష్ణోయ్ ట్విట్టర్ యూజర్లకు సరికొత్త పజిల్ ను ఇచ్చారు. ఆయన ఒక ఫోటోను అప్లోడ్ చేసి ఇందులో ఉన్న జంతువును మీరు ఎంత తొందరగా పసిగట్టగలరు అని అడిగాడు.
ఆయన పోస్టు చేసిన ఫోటోలో ఇంతకూ ఏమి ఉందంటే.. 'పచ్చికలో ఓ జింక ఉంది.. చుట్టూ చెట్ల పొదలు.. గడ్డి.. కింద కొన్ని నీళ్లు..' కానీ ఆ జింకను వేటాడడానికి మాటువేసిన జంతువును ఎవరెవరు కనుక్కోగలరు అంటూ రమేష్ బిష్ణోయ్ ప్రశ్నను అడిగారు. చాలా మంది నెటిజన్లు ఆ ఫోటోలో ఇంకేదో జంతువు ఉందంటూ తెగ వెతికారు. జూమ్ చేసి మరీ వెతికినా తమకు మరేదీ కనపడలేదని తెలిపారు.
మీరు కూడా ప్రయత్నించండి.. మేము చెప్పేదానికంటే ముందుగా మీరే కనుక్కుంటే ఆ థ్రిల్ వేరేలా ఉంటుంది.
కానీ కొందరు మాత్రం పసిగట్టేశారు. ఇంతకూ ఆ ఫోటోలో జింకను వేటాడడానికి సిద్ధంగా ఉన్న జంతువేంటో తెలుసా..? ఓ పులి..!
పులా అది ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా.. ఫోటోలో పైన ఎడమవైపున వేటాడడానికి ఎదురుచూస్తున్న పులిని గమనించవచ్చు. ఆ చెట్ల మధ్యలో పులి ఏ మాత్రం అనుమానం రాకుండా మాటువేసి ఉంది.
లాక్ డౌన్ సమయంలో ఇలాంటి ఛాలెంజ్ లు ఎన్నో సోషల్ మీడియాలో నెటిజన్లకు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ఇలాంటి వాటిని ఇతరుల కోసం షేర్ చేస్తూ ఉన్నారు. #LockdownPuzzles అంటూ ట్విట్టర్ లో చాలా పజిల్స్ అందుబాటులో ఉన్నాయి.