క‌రోనావ్యాప్తి విస్తృత‌మ‌వుతున్న నేఫ‌థ్యంలో దేశంలో చాలా రాష్ట్రాలు ఇప్ప‌టివ‌ర‌కే లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌న తెలంగాణ రాష్ట్రంలో కూడా లాక్‌డౌన్ కొన‌సాగుతుంది. దీని కార‌ణంగా ఇప్ప‌టికే ప్ర‌జా ర‌వాణా స్థంభించ‌గా.. ఇప్పుడు దిన‌ప‌త్రిక‌ల స‌ర‌ఫ‌రా కూడా నిలిచిపోయింది.

పేప‌ర్ ద్వారా కూడా క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఉండ‌టంతో.. నిద్ర‌లేవ‌క మునుపే డోర్ త‌ట్టే పేప‌ర్ బాయ్ నేడు రాలేదు. అస‌లే లాక్‌డౌన్‌తో ఇంట్లో ఉన్న జ‌నాల‌కు.. పేప‌ర్ ఆగిపోవ‌డం ఓ ర‌కంగా పొద్దుపోని విష‌య‌మ‌నే చెప్పాలి.

దిన‌ప‌త్రిక‌ల స‌ర‌ఫ‌రా ఆపండి

ఇదిలావుంటే.. కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా నివారణ చర్యలులో భాగంగా రేపటినుంచి ఈ నెల 31 వరకు అన్నీ దినపత్రికలు సరఫ‌రా నిలిపివేస్తునట్లు మల్కాజిగిరి హాక్కర్స్ అసోసియేషన్ నిర్ణయించింది . ఈ మెరకు పత్రికల ఏజెంట్లకు మరియూ యాజమాయాలకు పేపర్ సరఫ‌రా నిలిపివేయాలని వినతీపత్రం అందజేసారు. ఈ సందర్భంగా హాకర్స్ అసోసియేషన్ సభ్యుడు మోహన్ రావ్ మాట్లాడుతూ మేముసైతం కరోనా వ్యాప్తి చెందకుండా పోరాటంలో భాగస్వాములం అవుతామని , కరోనా ప్రభావం తగ్గగానే తిరిగి సప్లై మొదలుపెడ్తామని , వినియోగదారులు సహకరించాలని కోరారు.

Also Read: కరోనాపై వాట్సాప్‌లో వదంతులు.. రెండేళ్ల జైలు శిక్ష

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమలులో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో రాష్ట్రాల్లో ప్రచురితమవుతున్న పలు దినపత్రికలు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాయి. కొన్ని పత్రికలు ఇప్పటికే ప్రింటింగ్‌ నిలిపివేయగా.. మరికొన్ని పత్రికలు మంగళవారం రాత్రి నుంచి ప్రింటింగ్‌ నిలిపి వేయాలని నిర్ణయించాయి. దినపత్రికల ప్రింటింగ్‌ ఆపడం దేశ చరిత్రలోనే అత్యంత అరుదు అని విశ్లేషకులు అంటున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.